Prakasam

News March 21, 2024

కొండపి: తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు పూర్తి

image

కొండపిలోని వేలం కేంద్రంలో తొలిరౌండ్ పొగాకు అమ్మకాలు బుధవారంతో పూర్తయ్యాయని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. రెండో రౌండ్ గురువారం నుంచి మొదలవుతుందన్నారు. ఇందులో బ్యారన్‌కు 4బేళ్ల చొప్పున విక్రయాలకు అనుమతించామన్నారు. రైతులు గ్రేడింగ్ సరిగ్గా చేసుకొని బేళ్లను వేలానికి తీసుకువచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 21, 2024

ప్రకాశం: అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

image

జిల్లాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అతడికి 10 జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనానికి చెందిన మిడసాల శివకృష్ణ(32) 2014లో హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 13 ఏళ్ల బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

ప్రకాశం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి

image

ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించడంతోపాటు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఎన్నికల అధికారులకు సూచించారు. కొండపి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎన్నికల కమిషన్ నిబంధనలపై మండల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అలాగే రిటర్నింగ్ అధికారులందరూ తమ బృందాల్లోని అధికారులను సిద్ధం చేయాలని తెలిపారు.

News March 20, 2024

మద్దిపాడు: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

ఎలుకల మందు తిని ఓ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. మద్దిపాడులోని బీసీ కాలనీకి చెందిన అన్నపరెడ్డి వెంకటలక్ష్మి(26) ఏడాదికాలంగా మానసికంగా ఆందోళన చెందుతుంది. ఈ క్రమంలో ఈనెల 17న ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలు రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 20, 2024

గుడ్లూరు: ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి

image

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 20, 2024

ప్రకాశం: ఇటు కొత్త.. అటు పాత

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. YCPలో ఒంగోలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులకు స్థాన చలనం కల్పించారు. TDP మాత్రం దాదాపు పాత నాయకులనే బరిలోకి దింపుతోంది. దర్శి, చీరాల అభ్యర్థులను కూటమి ఇంకా ప్రకటించనప్పటికీ అక్కడ కూడా దాదాపు లోకల్ వాళ్ల బరిలో ఉండే అవకాశం ఉంది. రెండు పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు.

News March 20, 2024

ఒంగోలు: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. ఒంగోలులోని కలెక్టర్ పరిపాలనా భవనంలో ఎన్నికల సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పారు. అవసరమైన సామగ్రిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని చెప్పారు.

News March 19, 2024

మర్రిపూడి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

మర్రిపూడి మండలం వెంకటక్రిష్ణాపురం వద్ద మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు కొండపి గ్రామానికి చెందిన బారెడ్డి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రతి రోజూ కొండపి నుంచి ధర్మవరం గ్రామానికి వచ్చి పాల వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

image

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్‌ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

News March 19, 2024

గిద్దలూరు: గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

image

గొడ్డలి దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన <<12881965>>TDP కార్యకర్త<<>> మునయ్యపై నలుగురు వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యను హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మునయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.