India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పదవికి పానుగంటి మురళి శనివారం రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను యార్డ్ సెక్రెటరీ కోటేశ్వరరావుకు అందజేశారు. పానుగంటి మురళితో పాటు మరో ఐదుగురు డైరెక్టర్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే యార్డు ఛైర్మన్‌తో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ ఇటీవలే రాజీనామా చేశారు.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1998 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీచేసి 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా ఓటమి చెందారు. 2019లో వైసీపీ తరఫున గెలిచారు. మళ్లీ 2024లో టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి మూడు పార్టీల తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా ఆయన రికార్డ్ సాధించారు.

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలోని పూల మార్కెట్ వద్ద గల రైల్వే గేట్ ఈనెల 21 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి 21వ తేదీ వరకు రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్టువర్టుపురం గేటు నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి పట్టణానికి తొలిసారి రావటంతో పాతబస్టాండ్ సెంటర్‌లో రద్దీ ఏర్పడింది. ఇందులో జేబుదొంగలు చేతివాటం చూపించారు. సుమారు 10 మంది వద్ద నుంచి రూ.15 లక్షల వరకు కాజేసినట్లు ఆరోపించారు. అయితే స్థానికులు ఓ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను దర్శికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.

చీమకుర్తి మండల పరిధిలోని చండ్రపాడులో మాటలు రాని, వినపడని యువతిపై మూడు నెలలుగా అఘాయిత్యం జరుగుతున్నట్లు బయటపడింది. ఆ యువతి గర్భిణీ అని తేలటంతో శుక్రవారం ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్‌ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దొనకొండ మండలంలోని చిన్న గుడిపాడులో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన చౌదల కృష్ణారెడ్డి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.50 వేల నగదు, బంగారు గొలుసు అపహరించారు. ఈ ఘటనపై శుక్రవారం దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గొట్టిపాటి ఫ్యామిలీకి TDP అధినేత చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. 1995లో తన మొదటి మంత్రివర్గంలో గొట్టిపాటి హనుమంతరావుకి స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తమ్ముడి కుమారుడైన గొట్టిపాటి రవికుమార్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అంతేకాకుండా 1999లో హనుమంతరావు కుమారుడు నరసయ్యకు MLA టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. హనుమంతరావు మనమరాలైన లక్ష్మికి కూడా దర్శి టిక్కెట్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసుల రెడ్డి విద్యుత్, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ కేటాయించారు. దీంతో జిల్లాకు రెండో సారి విద్యుత్ శాఖనే వరించింది. గత ప్రభుత్వంలో జిల్లాకు ఇద్దరికి మంత్రి పదవులు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వంలో కూడా ఇద్దరికి మంత్రి పదువులు వరించాయి.
Sorry, no posts matched your criteria.