India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేశ్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలు లేవని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సంతనూతలపాడు మండలం ఏండ్లూర్ వద్ద మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ శిక్షణ తరగతులు ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జే.రవితేజ యాదవ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి 45 సంవత్సరాలు లోపు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దొనకొండ మండలం పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ వీరం రంగారెడ్డి దగ్గర రూ.2,64,000 పెన్షన్ నగదును గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సొంతూరు చందవరం నుంచి పెద్దన్నపాలెంకు పింఛన్ పంపిణీకి వస్తుండగా బాధాపురం సమీపంలో బండి ఆపి ఉద్యోగిని కొట్టి నగదును తీసుకెళ్లారన్నారు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంతనూతలపాడు మండలం గొర్ల మిట్టలో శుక్రవారం మద్దినేని సుబ్బారావు, మద్దినేని లక్ష్మీనారాయణ అనే రైతులకు చెందిన పొగాకు బేరన్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు సుమారు పది లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. పొగాకు, కర్ర టైర్లు, కాలిపోయి బారెన్ దెబ్బతిన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రంగారాయుడు చెరువు వద్ద ఒంగోలు నగర భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆరామ క్షేత్రాన్ని నిర్మించారు. దీనిని ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు పద్మశాలి సంఘ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరూ పాల్గొనాలని కోరారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గురువారం ఇండియన్ మెడికల్ హాల్‌లో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, కుటుంబ, సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సకాలంలో లక్ష్యాలను సాధించాలని ఆయన వైద్య సిబ్బందికి ఆదేశించారు.
ఫిబ్రవరి 5వ తేదీన జరిగే వైసీపీ ఫీజు పోరు పోస్టర్‌ను ఒంగోలు వైసీపీ కార్యాలయం వద్ద జిల్లా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రూ.3900 కోట్ల ఫీజుల బకాయి ఫీజులు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు.
తర్లుపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం సందర్శించారు. ముందుగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి, రెవెన్యూ సదస్సు, బంగారు బాల్యంపై విచారించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 5న ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వచ్చేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన బలాన్ని చాటుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే జనసేనలోకి పవన్ సమక్షంలో భారీగా చేరికలు ఉండనున్నట్లు టాక్. పవన్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
పార్లమెంట్ సభ్యులతో మంగళవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో భాగంగా.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి CMని కలిశారు. ఒంగోలు దగ్గర విమానాశ్రయం, ఒంగోలులో మ్యూజిక్- డాన్స్ కాలేజీ, గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం చెరువు అభివృద్ధితోపాటు చెరువులోని 8 కొండలకు అష్టదిగ్గజాల పేర్లు పెట్టడం గురించి లిఖిత పూర్వకంగా కోరారు.
Sorry, no posts matched your criteria.