India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్కాపురం మండలంలోని గొట్టిపడియ బీట్‌లోని చక్రాల కాలువ లొకేషన్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన గేదెను <<14000352>>చిరుత పులి చంపి<<>> తినేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం మేత కోసం పశుపోషకులు గేదెను అడవిలోకి వదలగా.. రాత్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం కాపరులు అడవిలో గాలించి చిరుత పులి దాడిచేసి చంపి తిన్నట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి రాతపూర్వక పిర్యాదులు/ వినతులను స్వీకరించి, వారితో ముఖాముఖీగా మాట్లాడి.. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని ఎస్పీ వారికి భరోసా కల్పించారు.
కందుకూరు పట్టణ శివారులోని ఏకలవ్య నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి రెండు మోటారు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇందూరు సాయి అనే యువకుడు మృతి చెందాడు. సాయి మణికంఠ అనే మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.

వరదల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అలాగే ఏపీలోని మూడు డిస్కంల సీఎండీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సీపీడీసీఎల్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఈపీడీసీఎల్ నుంచి 300 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 200 టెక్నీషియన్లను వరద ప్రాంతాల్లో రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.
ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ దామోదర్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి రాతపూర్వక పిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో విచారించి నిర్నీత గడువులో పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
చిన్నగంజాం రెస్టారెంట్ దగ్గర బోలెరో అదుపుతప్పి బోల్తా పడటంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108లో చీరాల గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ తరలించారు.
మార్కాపురం మండలం గొట్టిపడియ పంచాయతీలోని అక్కచెరువు తాండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం.! ఆదివారం గేదెను మేత కోసం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు వదిలారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఉదయం అడవిలో వారు గాలించారు. పెద్ద పులి దాడి చేసి చంపి తిన్నట్లుగా గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.