Prakasam

News August 31, 2024

అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా 

image

బేస్తవారిపేట పట్టణ సమీపంలోని అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసరావుపేట నుంచి గుంతకల్లు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని డివైడర్‌పైకి ఎక్కించాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

News August 31, 2024

నేరాల నియంత్రణకు చర్యలు: ప్రకాశం ఎస్పీ

image

జిల్లాలో నేరాల కట్టడికి అన్ని చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారి సమీక్షను ఎస్పీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అసాంఘిక కార్యక్రమాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

News August 30, 2024

ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా గంధం చంద్రుడు

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఏపీ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను జిల్లాలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 30, 2024

మాజీ మంత్రి బాలినేనిపై సీఎంకు ఫిర్యాదు

image

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్. రియాజ్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. గురువారం అమరావతిలో సీఎంను కలిసిన రియాజ్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

News August 30, 2024

కొమరోలు: పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. కొమరోలు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్.. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి పట్ల ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యకు పాల్పడడంతో కేసు నమోదయింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా విధించారు.

News August 29, 2024

బల్లికురవలో విషాదం.. ట్రాక్టర్ నుంచి జారిపడి మహిళ మృతి

image

బల్లికురవ మండలంలోని కొమ్మినేని వారి పాలెంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడంతో కరీమున్ అనే మహిళ మృతిచెందింది. మరో మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.

News August 29, 2024

అద్దంకి: బెదిరించి విద్యార్థినిపై అత్యాచారం

image

అద్దంకి మండలానికి చెందిన విద్యార్థినిని సంపెంగుల రాజేశ్ అనే వ్యక్తి వెంటపడి వేధించి ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెదిరించి నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ తెలియజేశారు.

News August 29, 2024

విశాఖలో హుందాతనం… ఒంగోలులో ఎక్కడ: తాటిపర్తి

image

విశాఖలో చూపించామని చెప్తున్న హుందాతనం.. ఒంగోలు, ఏలూరులో ఎక్కడికిపోయిందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ‘ఓడిపోయే విశాఖ ఎమ్మెల్సీ సీట్‌లో రాజకీయ హుందాతనం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎగ్గొట్టడం. ఒంగోలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లను కొనడంలో మాత్రం హుందాతనం బదులు బొంకుతనం ప్రవేశపెట్టడం టీడీపీ రాజకీయ విధానం.’ అని Xలో పోస్ట్ చేశారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.