India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యర్రగొండపాలెంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. బూదాల అజిత్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బుధవారం తాడేపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైపాలెంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని షర్మిల సూచించారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యతలు నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలో ఏఎస్పీగా పని చేస్తున్న నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లాకు నూతన ఎస్పీని నియమించనున్నట్లు సమాచారం.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎంఎస్ చదివేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో రేవంత్ అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి కారులో పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా పొగ మంచు కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులకు స్వల్ప గాయాలు కాగా, రేవంత్ మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు రూ.2.35 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి(నిన్న బదిలీ) వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 18 అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్ఠంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, మద్యం సీజ్ చేశారు.

పూడికతీత పనులకు కాకుండా నూతన వ్యూహాత్మక పనులను చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులపై మంగళవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పొలాలలో ఇంకుడు గుంతలు, కాలువ గట్లపై మొక్కలు నాటడం, కల్చర్ ప్లాంటేషన్ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రముఖుల ప్రొఫైల్ పిక్ తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.3.20 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ఫ్లయింగ్ స్కాడ్‌తో కలిసి నగదును జిల్లా గ్రీవెన్స్‌కు అప్పగించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.

టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి రూ.70వేలును ఎస్ఐ నాగేశ్వరరావు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న పరమేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎస్పీని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.