India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బేస్తవారిపేట వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బేస్తవారిపేటకు చెందిన సుభాని అనే వ్యక్తి బైక్ అదుపు తప్పి సెంటర్‌లోని సైడ్ రైలింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108లో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తెనాలి- 2 టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన ఓ యువతి ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి, వాటిని కొరియర్‌లో ఆమెకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తెనాలి- 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభానికి చెందిన అబ్దుల్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.
సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని దర్శి పోలీసులు సూచించారు. శనివారం దర్శి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన నేపథ్యంలో వారు పలు సూచనలు చేశారు. కాలువలు, బావులు, చెరువుల్లో ఈతకు దిగినప్పుడు, సముద్రంలో మునిగేటప్పుడు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో 8మంది ట్రైనీ ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఇందులో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్‌గా సహదిత్ వెంకట్‌ను నియమించింది. కందుకూరు సబ్ కలెక్టర్‌గా శ్రీపూజ నియామకం అయ్యారు. మార్కాపురం సబ్ కలెక్టరుగా పని చేసిన రాహుల్ మీనా ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో మే 7, 1958లో <<13940431>>డేవిడ్ రాజు<<>> జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, LLBలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1987లో టీడీపీలో మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1999లో, మొదటిసారి సంతనూతలపాడు నుంచి MLAగా ఎన్నికయ్యారు. 2009, ఎర్రగొండపాలెం నుంచి ఓటమి చెందగా, 2014(YCP)లో గెలిచారు.
మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతిపట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. జడ్పీ ఛైర్మన్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి డేవిడ్ రాజు ఎదిగారని మంత్రి చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనారోగ్య కారణాలతో డేవిడ్ రాజు ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
దర్శి బ్రాంచ్ కెనాల్లో మూడో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని కొద్దిసేపటి కిందట గుర్తించారు. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్థులు, పోలీసుల సహకారంతో కాలువలో గల్లంతయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కెనాల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నిన్న గల్లంతు కాగా.. నిన్న ఒకరు, ఇవాళ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని RUDSET సంస్థలో వచ్చేనెల 1వ తేదీ నుంచి 30 రోజులపాటు, యువకులకు కార్ డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు RUDSET సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు దామచర్ల సక్కుబాయమ్మ కళాశాలను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.