India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కేంద్రమైన ఒంగోలులోని RUDSET సంస్థలో వచ్చేనెల 1వ తేదీ నుంచి 30 రోజులపాటు, యువకులకు కార్ డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు RUDSET సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు దామచర్ల సక్కుబాయి కళాశాలను సంప్రదించాలన్నారు.
దర్శి నియోజకవర్గంలో ఈత సరదాతో సాగర్ కాలువలో ముగ్గురు యువకులు <<13935662>>గల్లంతైన విషయం తెలిసిందే.<<>> వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జిల్లాలో సాగుకు సాగర్ నీటిని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కేటాయింపుల ఆధారంగా నీటి పంపిణీ జరుగుతుందన్నారు. సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆమె కోరారు.
మీ కోసం (ప్రజా ఫిర్యాదుల దినం)ను సోమవారం రద్దు చేసినట్లు కార్యక్రమ జిల్లా సూపరింటెండెంట్ డి నాగజ్యోతి తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అర్జీలతో ఎవ్వరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీకోసం రద్దు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.

వచ్చే అయిదేళ్లకు గాను జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు ప్రకాశం భవన్లో జిల్లా ఉన్నతాధికారులతో ఆమె శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు, వినూత్నంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్, జడ్పీ సీఈవో మాధురి పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది. ఈనెల 19వ తేదీ నుంచి బదిలీల పర్వం మొదలవనుండగా.. 31వ తేదీలోపు బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. చాలాకాలం తర్వాత సాధారణ బదిలీలు జరుగుతున్నందున ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో 15 డిపార్ట్మెంట్లలో ఈ బదిలీలు జరుగనున్నందున ఉద్యోగులు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.13,84,259 భారీ ఆదాయం వచ్చినట్లు ఆలయ EO శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో ప్రధానంగా అన్న ప్రసాదానికి రూ.4,43,725, ప్రత్యేక దర్శనానికి రూ.4,80,000, లడ్డూ ప్రసాదానికి రూ.2,09,780, తలనీలాలకు రూ.63,100, వివిధ పూజలకు రూ.45,090, రూము అద్దెలకు రూ.35,120లు ఆదాయంగా లభించిందన్నారు.
ఈతకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దర్శి సాగర్ బ్రాంచ్ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి యువకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిలో కొత్తపాలెం గ్రామానికి చెందిన లోకేశ్ మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన ఇద్దరి కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.