Prakasam

News August 23, 2024

గిద్దలూరులో రైల్వే‌ట్రాక్‌పై మహిళ మృతదేహం

image

గిద్దలూరులో రైలు పట్టాలపై శుక్రవారం ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. పట్టణ శివారులోని ఆర్మీ క్యాంటీన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ మృతి చెంది పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..?, రైలు ఢీకొట్టిందా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 23, 2024

ఒంగోలు కలెక్టరేట్‌లో ప్రకాశం జయంతి వేడుకలు

image

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా.. ఒంగోలు కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి, MP మాగుంట, MLA దామచర్ల నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.

News August 23, 2024

ప్రకాశం: డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు

image

ప్రకాశం జిల్లాలో 8 మంది డిప్యూటీ తహశీల్దార్లు తహశీల్దార్లుగా పదోన్నతులు పొందారని కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. 1. మురళీ (కొండేపి), 2. ఆంజనేయులు (టంగుటూరు), 3. శాంతి (దోర్నాల), 4. నాగార్జునరెడ్డి (స్పెషల్ తహశీల్దార్ KRRC మార్కాపురం), 5. జనార్దన్ (జరుగుమల్లి), 6. భాగ్యలక్ష్మి (కొమరోలు), 7. సత్యసాయి శ్రీనివాసరావు (కలెక్టరేట్ ఒంగోలు), 8. జితేందర్ కుమార్ (బెస్తవారిపేట) మండలాలకు కేటాయించారు.

News August 23, 2024

ప్రకాశం: YCP ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా మాజీ MLA

image

YCP ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా మాజీ MLA టీజేఆర్‌ సుధాకర్‌బాబు నియామకమయ్యారు. వైసీపీ బలోపేత కార్యక్రమంలో భాగంగా అనుబంధ కమిటీలను YS జగన్ గురువారం ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జగన్‌కి రుణపడి ఉంటారని మాజీ MLA టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు.

News August 23, 2024

నేటి గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభించనున్న గ్రామ సభలను, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభల సంసిద్ధతపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నేటి గ్రామ సభలలో మండలాధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News August 22, 2024

నీటి పైపు లైన్‌కు శంకుస్థాపన చేసిన ఒంగోలు MP

image

ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 వద్ద నవోదయ స్కూల్‌కి వెళ్లే నీటి పైపులైన్‌కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నవోదయ స్కూల్ విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ సుజాత, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

News August 22, 2024

నీటి పైపు లైన్‌కు శంకుస్థాపన చేసిన ఒంగోలు MP

image

ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు-1 వద్ద నవోదయ స్కూల్‌కి వెళ్లే నీటి పైపులైన్‌కు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. నవోదయ స్కూల్ విద్యార్థుల నీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఒంగోలు నగర మేయర్ సుజాత, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

News August 22, 2024

కంపెనీల నుంచి జగన్ కమీషన్ దండుకున్నాడు: గొట్టిపాటి

image

YS జగన్ లొసుగులు ఉన్న కంపెనీలను బెదిరించి కమీషన్ దండుకున్నాడని దర్శి TDP ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ‘X’ వేదికగా ఆరోపించారు. ‘ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్‌ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తా అని చెప్పిన దాన్ని కూడా సరిగ్గా చేయించలేదు. ఏ కంపెనీల్లో సేఫ్టీ లొసుగులు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి కమీషన్లు దండుకున్నాడు. అందుకే ఎల్జీ పాలిమర్స్ తర్వాత కూడా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి’అని పోస్ట్ చేశారు.

News August 22, 2024

నేడు పీఆర్ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటన

image

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వీఆర్. కృష్ణతేజ గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలుత టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో చేపట్టిన ఫీడర్ ఛానల్ పనుల పరిశీలిస్తారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమవుతారు. అనంతరం జయవరం గ్రామంలోని ఉద్యాన పండ్ల తోటల సాగును పరిశీలించి రైతులతో మాట్లాడతారు.

News August 22, 2024

చీరాల: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

image

మండల పరిధిలోని పిట్టువారిపాలెంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం స్థానిక MLA కొండయ్య ఫొటోతో, తమ ఫొటోలను చేర్చి TDP వర్గీయులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. ఇది స్థానిక YCP వర్గీయులే చేసి ఉంటారని TDP నాయకులు భావించారు. ఈ ఘటనతో YCPకి చెందిన పోలయ్య, TDPకి చెందిన బాలకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది.