Prakasam

News August 22, 2024

ప్రకాశం: నామినేటెడ్ పదవి దక్కేది ఎవరికి?

image

మరో రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో రాజకీయం మొదలైంది. ఇక్కడి నుంచి దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, దర్శి యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబుతో పాటు జనసేనా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికి పదవి వరిస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News August 22, 2024

మంత్రి అచ్చెన్నాయుడుని కలిసిన నూకసాని

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చినట్లు నూకసాని తెలిపారు.

News August 21, 2024

నెల్లూరులో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లా కొమురోలు గ్రామానికి చెందిన షేక్ జలీల్ (60) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మణికంఠ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News August 21, 2024

నెల్లూరులో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లా కొమురోలు గ్రామానికి చెందిన షేక్ జలీల్ (60) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మణికంఠ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News August 21, 2024

ప్రకాశం: రసాయనాలతో డబ్బు రెట్టింపు చేస్తానని టోకరా

image

తాళ్లూరుకు చెందిన చిన్నసుబ్బరాయుడిని మంగళవారం కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు కర్నూలుకు చెందిన సయ్యద్ మహమ్మద్‌కు చిన్న సుబ్బ రాయుడు పరిచయమయ్యాడు. తనకు కొంత డబ్బిస్తే రసాయనాలు వాడి రెట్టింపు చేస్తానని నమ్మించాడు. మొదట రూ.5వేలు ఇవ్వగా రూ.10 వేలు ఇచ్చి నమ్మించాడు. మరింత ఆశతో రూ.19.50 లక్షలు ఇచ్చాడు. తయారు చేసే యంత్రం తీసుకొస్తానని ఉడాయించాడని సయ్యద్ పోలీసులను ఆశ్రయించాడని తెలిపారు .

News August 21, 2024

చీరాల: మరో ఇద్దరు దొరికారు

image

చీరాల సమీపంలోని ఈపూరుపాలెం యువకుడు ఆరిఫ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు DSP జగదీశ్ నాయక్ వెల్లడించారు. ఈ నేరానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఇంతకుముందే ఆరుగురి పట్టుబడగా.. తాజాగా పరారీలో ఉన్న గరిక మహేంద్ర, కర్రెద్దుల వంశీకుమార్ దొరికారు. త్వరలోనే పక్కాగా ఛార్జ్‌షీట్ వేస్తామని DSP చెప్పారు.

News August 21, 2024

ప్రకాశం జిల్లాలో పలువురు SIల బదిలీ

image

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలో భాగంగా అర్ధవీడు నూతన ఎస్సైగా బి సుదర్శన్ యాదవ్ నియమితులయ్యారు. అలానే కురిచేడు ఎస్సై శ్రీకాంత్ నాగులుప్పలపాడుకు, ఎస్సై మహేశ్ వీఆర్ నుంచి దోర్నాలకు, వెలిగండ్ల ఎస్సై శివ కురిచేడుకు బదిలీ అయ్యారు.

News August 20, 2024

బొడ్డువానిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం… వివరాలివే.!

image

కొరిసపాడు మండలంలోని బొడ్డువానిపాలెం ఆర్చి వద్ద మంగళవారం తెల్లవారుజామున <<13896179>>రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది<<>>. అద్దంకి పట్టణానికి చెందిన నాగూర్ బాషా ద్విచక్ర వాహనంపై ఒంగోలు వెళ్తూ.. డైవర్షన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బారికేడ్స్‌ను ప్రమాదవశాత్తు గుద్ది కింద పడటంతోఅక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేదరమెట్ల ఎస్సై రఫీ మంగళవారం సాయంత్రం తెలిపారు.

News August 20, 2024

ప్రకాశం: CC రోడ్ల నిర్మాణానికి లైన్ క్లియర్

image

2023-24 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ నిధులు రూ.120 కోట్లు ప్రకాశం జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి రూ.15 కోట్లు చొప్పున ప్రతి మండలానికి రూ. 3 కోట్లు అందే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని కొత్తపట్నం, ఒంగోలు మండలాలకు రూ.7.50 కోట్లు కేటాయించారు. తద్వారా మండలంలోని 92 కి.మీ CC రోడ్లు, 61 కి.మీ కాలువల నిర్మాణం చేపట్టనున్నారు.

News August 20, 2024

పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలను అభినందించిన ఎస్పీ

image

ఒంగోలులోని ఏఆర్ పోలీస్ క్రీడా మైదానంలో పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణాన్ని అందిస్తాయన్నారు.