Prakasam

News August 19, 2024

వేటపాలెం: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. బాలిక మృతి

image

వేటపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌ను కారు ఢీ కొట్టడంతో 12 సంవత్సరాల బాలిక మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 19, 2024

వైఎస్ జగన్‌పై కౌంటర్ అటాక్ చేసిన ఎమ్మెల్యే దామచర్ల

image

వైసీపీ పాలనలో వెలుగొండ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రస్తుతం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పశ్చిమప్రకాశం జల ప్రసాదిని వెలుగొండ పూర్తి అయినట్లు ప్రజలకు మాయమాటలు చెప్పి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ చెప్పే మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.

News August 19, 2024

కనిగిరి: ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

image

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కనిగిరి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఓ మహిళ సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద రూ.8,50,000 డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు, ఎస్పీతో తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

News August 19, 2024

ప్రకాశం: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

image

ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్‌ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించకండి అని ప్రకాశం జిల్లా ఎస్బీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

News August 19, 2024

ఒంగోలులో మాక్ పోలింగ్.. అభ్యంతరం తెలిపిన YCP

image

ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో వాడి‌న EVMలపై అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు కమిషన్ నుంచి అనుమతి రావడంతో సొమవారం నుంచి మాక్ పోలింగ్‌కు కలెక్టర్ అన్సారియా ఏర్పాట్లు చేశారు. మాక్ పోలింగ్ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. వీవీ ప్యాట్స్ లెక్కింపు అడిగితే దానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ నడుస్తుందని కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఇచ్చారు.

News August 19, 2024

అమెరికాలో ప్రకాశం టెకీ మృతి

image

ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు(40) కాలిఫోర్నియా బీచ్‌లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. 20 నెలల క్రితం ఆయన అమెరికా వెళ్లారు. ఆరు నెలల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు కూడా అమెరికాకు వెళ్లారు. శనివారం బీచ్‌కి వెళ్లి స్నానం చేస్తుండగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరులోని బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం ఈ సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News August 19, 2024

చీరాల రైల్వే స్టేషన్ @125

image

చీరాల రైల్వే స్టేషన్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ బ్రిటిష్ పాలకులు రైల్వే లైను నిర్మించారు. ఇందులో భాగంగా కోల్ ‌కతా, చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వేస్టేషన్‌ను 1899లో అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిపాలన కింద ఉంది.

News August 19, 2024

ఒంగోలులో టెన్షన్ టెన్షన్

image

ఒంగోలులో ఈరోజు నుంచి 24 వరకు రీ మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అభ్యంతరం తెలపడంతో అధికారులు మాక్ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలోని మొత్తం 12 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. దీంతో ఏం జరగనుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News August 19, 2024

ఒంగోలులో నేటి నుంచి మాక్‌ పోలింగ్‌

image

ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి నేటి నుంచి మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈవీఎంల్లో అవకతవకలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పర్యవేక్షిస్తారు.

News August 19, 2024

ఒంగోలు: స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలపరిధిలో ఈనెల 29న స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సుభద్ర తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 2023-24 క్రీడల్లో తప్పక పాల్గొని ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.