Prakasam

News August 18, 2024

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆదివారం జిల్లాలోని 21 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ స్టేషన్లలో ఉన్న ఎస్సైలకు స్థానచలనం కలిగించడంతో పాటుగా విఆర్‌‌లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చారు. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

News August 18, 2024

కాలిఫోర్నియాలో ముండ్లమూరు వాసి మృతి

image

ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు (40) అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో బీచ్ ‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు బుచ్చిబాబు తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులకు కొడుకు చనిపోయిన విషయం తెలియటంతో శోకసముద్రంలో నిండిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 18, 2024

మార్కాపురం: కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

image

మార్కాపురం పట్టణానికి చెందిన కరాటే స్కూల్ విద్యార్థులు చెన్నైలో జరిగిన కరాటే పోటీల్లో సత్తా చాటారు. చెన్నై మౌంట్ ఫోర్ట్ లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 3 జోన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మార్కాపురానికి చెందిన విద్యార్థులు రెండు గోల్డ్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కె.మహితా రెడ్డి, భార్గవ్‌లు గోల్డ్ మెడల్స్ సాధించారు.

News August 18, 2024

ఒంగోలులో త్వరలో ఎయిర్పోర్ట్

image

రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్మినల్ కెపాసిటీలు పెంచుతున్నామన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు. దీంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 18, 2024

పర్చూరులో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. కేసు

image

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేసినట్లు పర్చూరు ఇన్‌ఛార్జి SI రత్నకుమారి తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఎదురింట్లో పాప ఉండటాన్ని గుర్తించిన తల్లి పాపను విచారించగా, జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 18, 2024

ప్రకాశం: నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

image

నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గీత కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 29 మండలాల నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి (2024-25) సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

News August 18, 2024

అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయండి: కలెక్టర్

image

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర-2047 అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.

News August 18, 2024

కంభం: చంద్రబాబుపై అనుచిత పోస్ట్ పెట్టిన మహిళ అరెస్ట్

image

కంభం పట్టణంలో సీఎం చంద్రబాబును అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు పెట్టిన ఓ మహిళను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోస్టు పెట్టిన వారిని గుర్తించారు. బేస్తవారిపేటకు చెందిన ఓ మహిళ పోస్ట్ పెట్టినట్లుగా గుర్తించి ముందుగా నోటీసు ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News August 17, 2024

ప్రభాస్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన మంత్రి గొట్టిపాటి

image

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో ప్రభాస్ సినిమా నేడు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. అనంతరం సినిమాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు.

News August 17, 2024

ప్రకాశం: డాక్టర్ లైంగిక వేధింపులు.. ANMల ఫిర్యాదు

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు నాగర్జున గౌడ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 15 మంది ANMలు TDP నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాలతో బాధితులను, డా.నాగర్జున గౌడ్‌ను DMHO సురేశ్ శుక్రవారం విచారించారు. గతంలోనూ పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడని తెలిపారు. వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు.