Prakasam

News August 17, 2024

కంభంలో ఉరేసుకొని మహిళ మృతి

image

కంభం పట్టణంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. నేపాల్‌కు చెందిన డింగిరి కమల అనే (24) మహిళ తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే మహిళ మృతికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News August 17, 2024

ప్రకాశం: నేడు 93 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు

image

జిల్లాలోని 80 పాఠశాలల్లో శనివారం యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న జిల్లాలో 2,465 పాఠశాలలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగా కోరం లేకపోవడం, కోర్టు ఉత్తర్వులు, ఇతర కారణాలతో 93 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. ఆయా పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు మళ్లీ రీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో నేడు ఆయా పాఠశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

News August 17, 2024

ప్రకాశం: జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు బంద్

image

కొల్‌కతాలోని జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లాలో శనివారం ఉదయం 6.గంటల నుంచి ఆదివారం ఉదయం 6.గంటల వరకు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ శ్రావణి తెలిపారు. స్థానిక ఐఎంఏ హాలులో అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించి ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం కేసులు మీనహా సర్వీసులు నిలిపివేస్తున్నామన్నారు.

News August 17, 2024

SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని: ఎస్పీ

image

ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్/SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ A.R దామోదర్ ప్రజలను కోరారు. మీ వాట్సప్ నంబర్‌కి Apk ఫైల్స్ పంపి, మీ ఫోన్ ‌ని హ్యాక్ చేసి సైబర్ నేరస్తులు ప్రజల నుంచి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి – మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.

News August 16, 2024

త్రిపురాంతకం: ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు

image

త్రిపురాంతకం మండలం మేడపిలోని యూనియన్ బ్యాంక్‌లో ఈ నెల 1వ తేదీన చోరీ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు ముద్దాయిలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ ఎస్. సుబ్బారావు వివరాలను వెల్లడించారు. మహిళ, యువకుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించిన ఎస్సై సాంబశివరావు సిబ్బందిని అభినందించారు. జల్సాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలు చేయడం నేరమని అలాంటి అలవాట్లు మానుకోవాలని యువతకు సూచించారు.

News August 16, 2024

టంగుటూరు: 913 పొగాకు బేళ్లు కొనుగోలు

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో శుక్రవారం జరిగిన వేలంలో 913 పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారని వేలం నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఆలకూరపాడు, అనంతవరం, రావివారిపాలెం, జయవరం, పాలేటిపాడుకు చెందిన రైతులు 980 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 913 కొనుగోలు చేశారు. 67 బేళ్లు తిరస్కరించారు. గరిష్ఠ ధర రూ.358 కాగా, కనిష్ఠ ధర రూ.205, సరాసరి ధర రూ.305.30 ధర పలికిందన్నారు.

News August 16, 2024

ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆరుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
➤ పుల్లలచెరువు – ఫాతిమా
➤ పొదిలి – కోటయ్య
➤ మార్కాపురం రూరల్ – వెంకటేశ్వర నాయక్
➤ దర్శి – సుమన్
➤ జరుగుమల్లి – వెంకట్రావు
➤ పొన్నలూరు – రాజేష్

News August 16, 2024

వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీలోకి నో ఎంట్రీ: ఎమ్మెల్యే కందుల

image

మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణ అధ్యక్షతన పట్టణ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అలాగే వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్పించుకోబోమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే దిశగా వార్డుల్లో ప్రతి నాయకుడు పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వార్డుల్లోని నాయకుడు సర్పంచ్‌తో సమానమని తెలిపారు.

News August 16, 2024

ప్రకాశం: 17 ఏళ్లకాలంలో నాడు అధికారి.. నేడు మంత్రి

image

మనదేశం ప్రజాస్వామ్య దేశమని చెప్పే మరో ఉదాహరణ ఇదే. 2007లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉత్తమ అవార్డు అందుకున్న మంత్రి స్వామి.. 2024లో మంత్రిగా ఎందరో ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేశారు. 3సార్లు వరుసగా కొండేపి నుంచి హ్యాట్రిక్ కొట్టిన మంత్రి స్వామి 2007లో కొండేపి ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వర్తించారు. అనంతరం రాజకీయ అరంగేట్రం చేసి, ఎమ్మెల్యేగా వరుసగా గెలిచి కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

News August 16, 2024

ఉత్తమ సేవలకు గానూ 368 మందికి ప్రశంసా పత్రాలు

image

జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వివిధ సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోల బాలంజనేయస్వామి ప్రశంసా పత్రాలను అందజేశారు. రెవెన్యూ శాఖలో 46మంది, ICDS14, వైద్యఆరోగ్యశాఖలో 14, పోలీస్ శాఖలో 27, సోషల్ వెల్ఫేర్ 20, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులో 11, జడ్పీలో 11 మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ ప్రశంసా పత్రాలను అందుకున్నారు.