Prakasam

News July 18, 2024

తాళ్లూరు: బావిలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బుధవారం కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి పంజాబ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పొలం వద్ద బావిలో నీరు తాగేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 18, 2024

బాలినేనికి మేయర్ షాక్ ఇస్తారా..?

image

ప్రకాశం జిల్లాలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత వ్యవహారం ఆసక్తి రేపుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఒంగోలుకు వచ్చిన మాజీ బాలినేని ఈ వార్తలను ఖండించారు. ఆమె వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆమె టీడీపీ ఎంపీ మాగుంటను కలిశారు. ఈక్రమంలో ఆమె బాలినేనికి షాక్ ఇస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.

News July 18, 2024

శాంతి భద్రత పరిరక్షణలో రాజీ పడేది లేదు: ఎస్పీ

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాతో తనకు మంచి అనుబంధం ఉందని, జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

News July 17, 2024

రేపు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 18, 19 తేదీలలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం తెలిపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండరాదని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

News July 17, 2024

సంతనూతలపాడులో ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద బుధవారం బైక్ ను టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న రావెళ్ళ వెంకట్రావు టిప్పర్ టైర్ల కింద పడి మృతి చెందాడు. వెంకట్రావు కుమార్తె లారీ టైర్ల కింద పడి కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కుమార్తెను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 17, 2024

రాచర్ల: పొలాల్లో పులి సంచారం

image

రాచర్ల మండలం ఫారం గ్రామ పరిసర పొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ప్రజలు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు పరిసర పొలాల్లో తిరుగుతుండగా పులి అడుగులను కనుగొన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో ఎఫ్ఎస్ఓ జమాల్ బాషా, శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పాదముద్రలను బట్టి పులి సంచరించినట్లు కనిపిస్తోందని, స్పాట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

News July 17, 2024

ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా దామోదర్ బాధ్యతలు

image

ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా ఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ నాగేశ్వరరావుతో పాటు జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

News July 17, 2024

సీ.ఎం.ఓ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మార్కాపురం వాసి

image

మార్కాపురం పట్టణానికి చెందిన తంగిరాల యశ్వంత్ సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన జమ్మలమడుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన అధికారిగా ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈయన తల్లిదండ్రులు జగన్నాథం, శర్వాణి ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం విశేషం.

News July 17, 2024

ఆస్ట్రేలియాలో కందుకూరు యువకుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో చనిపోయిన విషాద ఘటన ఇది. కందుకూరు పట్టణానికి చెందిన చైతన్య(29) గుంటూరులో బీటెక్‌ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్లాడు. గతేడాది వివాహమైంది. చైతన్యతో పాటు బాపట్లకు చెందిన సూర్యతేజ, మరో స్నేహితుడు కలిసి అక్కడి మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.

News July 17, 2024

కారంచేడు ఘటనకు 39 ఏళ్లు పూర్తి

image

కారంచేడు ఘటనకు నేటితో 39 ఏళ్లు పూర్తయింది. 1985 జులై 17న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో దేశమంతా కారంచేడు వైపు చూసింది. కారంచేడు అనే ఊరి పేరు ఒక్కసారిగా దేశమంతటా మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం జులై 17న చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనిలో కారంచేడు మృత వీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభను పలువురు నిర్వహిస్తారు.