India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన దర్రె పుల్లయ్య ఆర్మీలో సాహసోపేత సేవలకుగాను సేవా మెడల్ అందుకున్నారు. మద్రాస్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్న ఆయన 2024లో నార్త్ గ్లేసియర్లో 200 అడుగుల లోతులో పడిన ఇద్దరు సైనికులను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ సాహసానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా మెడల్‌ను అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శనివారం ఆర్మీ అధికారులు అందజేశారు.

మార్కాపురం జిల్లా సాధించడమే కాకుండా అభివృద్ధి చేసి చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… చెరువును ట్యాంక్ బండ్‌లా మార్చి అన్నగారి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి పోలేరమ్మ ఆలయం వైపు కలెక్టరేట్ కార్యాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలో మార్కాపురం జిల్లా రూపురేఖలు మారుస్తామన్నారు.

కొండపి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునీల్ బదిలీ అయ్యారు. ఆయనను కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న శంకర్ రావును నియమించారు. త్వరలో ఆయన కొండపికి వస్తారు. పాత అధికారి సునీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బోర్డులో రైతులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు.

పొదిలి(M) గోగినేనివారిపాలెంలో గత నెల 18న జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుల్లెమ్మ(49) భర్త చనిపోగా ఒంటరిగా ఉంటోంది. అదే ఊరికి చెందిన ఏడుకొండలుకు చాలామంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్యకు బుల్లెమ్మ చెప్పింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. బుల్లెమ్మపై పగ పెంచుకున్న ఏడుకొండలు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోరిక తీర్చాలని అడగ్గా.. ఒప్పుకోలేదు. దీంతో మెడకు తాడు బిగించి చంపేశాడు.

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.
Sorry, no posts matched your criteria.