Prakasam

News April 1, 2024

ప్రకాశం: మసిలే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

image

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.

News April 1, 2024

ప్రకాశం: నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు

image

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఫిర్యాదులు ఉన్న వెంటనే తెలిపేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఒంగోలు -08592-288099, సంతనూతలపాడు-08592-273100, కొండపి -085982-94717, దర్శి -8639370180, మార్కాపురం-9281034442, గిద్దలూరు -8639483409, ఎర్రగొండపాలెం- 6281735787, జిల్లా సీసీఆర్-08692-288599.

News March 31, 2024

కొండపి: చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి

image

కొండపి మండలంలోని నేతివారిపాలెం సాయిబాబా గుడి వద్ద ప్రమాదం జరిగింది. చీమకుర్తి మండలానికి చెందిన ఇద్దరు యువకులు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ గుడికి బైక్‌పై వెళ్లి వస్తూ మద్యం మత్తులో చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాగం చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కొండపి ఎస్సై కృష్ణబాజీ పరిశీలించారు.

News March 31, 2024

మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తా: చంద్రబాబు

image

మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురానికి నీళ్లు, నియామకాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే సంపద సృష్టిస్తూ.. సంక్షేమాన్ని ఇస్తానని తెలిపారు. ‘సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. గంజాయి తెచ్చే ముఖ్యమంత్రి కావాలా’ అని ప్రజలను అడిగారు.

News March 31, 2024

గిద్దలూరులో గెలుపు ఎవరిది?

image

గిద్దలూరు ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో 12 వేలకు వైగా ఓట్లతో గెలిచారు. అటు వైసీపీ నుంచి మార్కాపురం MLA కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు బరిలో ఉన్నారు. స్థానికులకే పట్టం కట్టాలని టీడీపీ ప్రచారం చేస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని కేపీ అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు.

News March 31, 2024

ప్రకాశం జిల్లా ఎన్నికల బరిలో ఒకే ఒక మహిళ

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలలో ఒకేఒక మహిళా అభ్యర్థి పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు.వైసీపీ నుంచి ఎవరు పోటీలో లేరు. దీంతో జిల్లాలో మహిళా అభ్యర్థి గెలుపుపై పార్టీలు లెక్కలేసుకుంటున్నారు.

News March 31, 2024

ప్రకాశం: ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేశ్‌కు డాక్టరేట్

image

పామూరు పట్టణ రెండో ప్రాదేశిక ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేశ్‌కు తమిళనాడుకు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. సామజిక సేవా విభాగంలో విశిష్ఠ సేవలు అందించి సందర్భంగా శనివారం యూనివర్సిటీ వారు ఆకుపాటి వెంకటేశ్‌ను సత్కరించి డాక్టరేట్‌కు సంభందించిన సర్టిఫికెట్‌ను, డాలర్‌ను అందజేశారు.

News March 30, 2024

కారంచేడు: ఆత్మహత్య చేసుకుంటానని వీడియో.. ఛేదించిన పోలీసులు

image

కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన కట్ట సుబ్బారావు (24) తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్‌కి వీడియో పంపాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో కారంచేడు పోలీస్ సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా బాధితుడిని గుర్తించి బంధువులకు అప్పగించారు.

News March 30, 2024

రేపు మార్కాపురానికి చంద్రబాబు రాక

image

ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్‌లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News March 30, 2024

ప్రకాశం జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

image

మార్కాపురంలోని గాంధీ బజార్‌లో శనివారం భవనం పైనుంచి ప్రమాదవశాత్తు సచివాలయ ఉద్యోగి పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లయ్య (32) ఉదయం ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రగాయాలపాలై మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.