Prakasam

News March 28, 2024

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదంలో UPDATE

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపల్లె జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తులో కారును డివైడర్ పైకి ఎక్కించడంతో వెహికల్ బోల్తా పడింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తూ ఉండగా, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.

News March 28, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పాలకొల్లు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

దర్శి టికెట్‌పై నీలినీడలు?

image

దర్శి టికెట్‌పై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, రోజుకో కొత్త పేరు వినపడుతోంది. టీడీపీ నుంచి గోరంట్ల రవికుమార్, మాజీ MLA గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. బాచిన కృష్ణచైతన్య, మాగుంట రాఘవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు.

News March 28, 2024

ఒంగోలు: ‘బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి’

image

వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రకాశ్ భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా రుణాలు మంజూరు వేగవంతం చేయాలన్నారు.

News March 27, 2024

ఒంగోలులో భారీగా చీరలు సీజ్ 

image

ఒంగోలు మండలం గుత్తికొండవారిపాలెంలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన చీరలు,  దుస్తులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు గోడౌన్‌లో సోదాలు చేసి 1000కి పైగా చీరలు, షర్ట్‌లు, ప్యాంట్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY

image

ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భానుడి ప్రతాపానికి మనుషులతో పాటు పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం. ఏల్చూరులోని ఓ ప్రధాన రహదారి పక్కనే ఉన్న చేతిపంపు నుంచి జాలువారుతున్న నీటి బిందువులను ఓ కాకి గొంతు తడుపుకుటుంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అలాగే పశువుల నీరు కోసం చేతిపంపు, బోర్లు వద్ద, ఇళ్లపైన తొట్టెలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

News March 27, 2024

ప్రకాశం: 8న సాగర్‌ జలాల విడుదలకు అవకాశం

image

జిల్లాలో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేశ్ కుమార్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీ సాగర్‌ జలాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు చోరీకి గురికాకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పహారాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేతి పంపుల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.

News March 27, 2024

రూ.1.79 కోట్ల నగదు స్వాధీనం: ప్రకాశం ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రూ.1,79,95,000 నగదు, 214 గ్రాముల బంగారం, 1,872 లీటర్ల అక్రమ మద్యం, 80.3 గ్రాముల మాదకద్రవ్యాలలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News March 27, 2024

బార్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేయండి: ప్రకాశం ఎస్పీ

image

జిల్లాలో సమయపాలన పాటించని బార్, రెస్టారెంట్ల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి అధికారులను అదేశించారు. కోడ్ అమల్లో ఉన్నా తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తుండడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్కాపురం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రెహమాన్ స్థానిక బార్ నిర్వాహకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు వారిని విక్రయించుకోవాలని సూచించారు.

News March 27, 2024

ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.231

image

ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఒంగోలు-1వ పాగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం అమ్మకాలకు కొణిజేడు నుంచి 889 వేళ్లు రాగా 716 వేళ్లు అమ్ముడయ్యాయని సూపరింటెండెంట్ రవికాంత్ తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.231, కనిష్ట ధర రూ.220 పలికిందన్నారు. సరాసరి ధర రూ.228.13 వచ్చినట్లు చెప్పారు. కొనుగోలులో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.