Prakasam

News July 7, 2024

ఒంగోలు: 11న ఐటీఐ విద్యార్థులకు జాబ్ మేళా

image

ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్‌ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్‌ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 7, 2024

దర్శి: క్షణికావేశంలో అన్నను హత్య చేసిన తమ్ముడు

image

దర్శి మండలం రాజంపల్లిలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రావులపల్లి ప్రసాద్ మద్యం తాగి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రసాద్ మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు బాలరాజు క్షణికావేశంలో కర్రతో ప్రసాద్‌ను బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News July 7, 2024

మార్కాపురం: ‘నకిలీ సర్టిఫికెట్లు ఏరి పారేయాలి’

image

నకిలీ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వంద మందిలో 25% నకిలీ వ్యక్తులే దివ్యాంగులుగా చలామణి అవుతూ నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

News July 7, 2024

ఒంగోలు: ఆకతాయిని స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

image

కారుకు పోలీసు హారన్‌ బిగించి ఒంగోలు రోడ్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ భయాందోళనలకు గురి చేసిన ఓ ఆకతాయికి స్థానికులు శనివారం దేహాశుద్ధి చేశారు. పేర్నమిట్టకు చెందిన రవి ఇటీవలే కొత్త కారు కొని 4 రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా తిరుగుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన మహిళ, స్థానికులు అతనిని పట్టుకొని తాళ్లతో కట్టేసి చితకబాదారు.

News July 7, 2024

చీరాల: కానిస్టేబుల్ సస్పెండ్

image

చీరాలలో టీడీపీ నాయకుడిపై దాడి చేసిన ఘటనలో నేరుగా పాల్గొన్న కానిస్టేబుల్ మువ్వా బాలశంకర రావు(ఉరఫ్ బాలు) సస్పెండ్ అయ్యారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడిపై కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో బాధితుడు చీరాల రెండో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 7, 2024

ఒంగోలు: అర్ధరాత్రి ఫోన్ చేసి మహిళకు వేధింపులు

image

మద్యం మత్తులో అర్ధరాత్రి సీనియర్ పోలీస్ అధికారి ఓ మహిళా సిబ్బందికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి మహిళా పోలీసుకు ఫోన్ చేసి ‘మీరు చాలా బాగుంటారు, భలే ఉంటారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె కాల్ రికార్డ్ ఆధారంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై ఎస్పీ వెంటనే ఆ అధికారిని రిలీవ్ అయి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

News July 7, 2024

ప్రకాశం: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ వాయు భారత సైన్యంలోకి చేరడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం అధికారి సందీప్ తెలిపారు. అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 6, 2024

సంతమాగులూరు: స్నేహం ముసుగులో హత్య 

image

సంతమాగులూరు మం, గురిజేపల్లిలో మార్చి 7న జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. వారి వివరాల మేరకు.. మేడబోయిన ఆంజనేయులు గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో రావులపల్లి నాగప్రసాద్ పరిచయమయ్యాడు. అప్పుల పాలయిన ప్రసాద్, ఆంజనేయులు వద్ద ఉన్న రూ.3 లక్షలను కాజేయాలని పన్నాగం పన్నాడు. దీంతో కరివేపాకు తోటలోకి తీసుకెళ్లి పూటుగా మద్యం తాగించి, హత్య చేసి నగదును ఎత్తుకెళ్లాడు. పోలీసుల దర్యాప్తులో విషయం బయట పడింది.

News July 6, 2024

పొదిలి: అపార్ట్‌మెంట్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

పొదిలిలో శనివారం విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి రోడ్డులోని SSR అపార్ట్‌మెంటులో మంచినీటి ట్యాంకును పలువురు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు సుబ్బయ్య అనే వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

హైకోర్టు ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా ప్రకాశం జిల్లా వాసులు

image

ఏపీ హైకోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా (AGP) ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అహమ్మద్, కొల్లూరి అర్జున్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 3వ తేదీ జీవో జారీ చేయగా వారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు.. చిన్న వయసులోనే AGPగా హైకోర్టుకు ఎంపిక కావడంపై జిల్లా వాసులు, తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.