Prakasam

News December 11, 2024

ప్రకాశం జిల్లా రైతులకు గమనిక 

image

ప్రకాశం జిల్లాలో కంది సాగు చేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వమే కందులు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.

News December 11, 2024

ప్రకాశం జిల్లా జవాన్ ఎలా చనిపోయారంటే..?

image

ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్‌ పేలడంతో వీర మరణం పొందారు.

News December 11, 2024

విజయవాడకు వెళ్లిన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

image

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఎ. తమీమ్‌ అన్సారియా, జె. వెంకట మురళి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

News December 11, 2024

ఇడుపులపాయ IIITలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత

image

ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్‌‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్‌లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.

News December 11, 2024

ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో ఇవాళ జగన్ భేటీ

image

వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఇవాళ భేటీ కానున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్‌ పర్సన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ఓటమి, బాలినేని పార్టీ వీడటం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

News December 10, 2024

విద్యుత్ వాహనాల పెంపుపై మాగుంట ప్రశ్న

image

దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలు, కేటాయించిన నిధులపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిస్తూ గత ఐదేళ్లలో 1,68,263 వాణిజ్య, మూడు చక్రాల, రెండు చక్రాల విద్యుత్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో 257 తయారీ యూనిట్లు ఉండగా రాష్ట్రంలో నాలుగు ఉన్నాయని వివరణ ఇచ్చారు.

News December 10, 2024

పొదిలిలో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

image

పొదిలి అడ్డరోడ్డు సమీపంలోఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళ వారం ఎన్ఫోర్స్‌మెంట్ ఆర్డీవో, ఆర్‌ఐ, వీఆర్‌వో కలిసి అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడ నుంచి తెచ్చారు, ఎన్నిరోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News December 10, 2024

జమ్మూలో కంభం ఆర్మీ జవాన్ మృతి

image

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సోమవారం జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందాడు. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పని చేస్తున్న వరికుంట్ల వెంకట సుబ్బయ్య అనే జవాన్ జమ్మూ కశ్మీర్‌లో వీధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి వీర మరణం పొందాడు. కాగా ప్రస్తుతం అతని మృతదేహాన్ని రాజా సుఖదేవ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌కు తరలించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News December 10, 2024

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై అధికారుల దృష్టి

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ నిర్వహించే ఉత్తర్వులలో భాగంగా.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటిరోజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలపై మీరేమంటారో కామెంట్ చేయండి.

News December 9, 2024

పర్చూరు వద్ద ఒకే రోజు నలుగురు మృతి

image

పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్‌పై బీచ్‌కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.