Prakasam

News June 9, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రివర్గం రేసులో ఎవరున్నారంటే..?

image

రాష్ట్ర కేబినెట్‌లో ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందోనని చర్చ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా నడుస్తోంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 స్థానాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మన జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో కామెంట్ చేయండి.

News June 9, 2024

ప్రకాశం: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెంలో బిహార్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ తాను అద్దెకు నివాసముంటున్న ఇంట్లో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అద్దంకి రూరల్ సీఐ శివరామ కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తిమ్మన్నపాలెంలోని గ్రానైట్‌లో పనిచేస్తుంటాడని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

రికార్డు బ్రేక్ చేసిన దామచర్ల జనార్దన్

image

ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్లపై 32,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎన్నికల్లో అదే అత్యధిక రికార్డు. కానీ 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ బాలినేనిపై 34,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్లదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.

News June 9, 2024

వెలిగండ్ల: ఆటో బోల్తా.. ఒకరు మృతి

image

ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివ తెలిపిన ప్రకారం పెరుగు పల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి కత్తి పౌలు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 9, 2024

గిద్దలూరులో భారీ మెజార్టీ నుంచి ఓటమి

image

గత ఎన్నికల్లో YCP గిద్దలూరు నియోజకవర్గంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి సైకిల్ జోరందుకుంది. 2019 ఎన్నికల్లో గిద్దలూరు YCP ఎమ్మెల్యే అన్నా రాంబాబు TDP MLA అభ్యర్థి అశోక్ రెడ్డిపై 81,035 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి తలక్రిందులైంది. TDP అభ్యర్థి అశోక్ రెడ్డి నాగార్జునరెడ్డిపై 973 ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఓటమికి గల కారణాలు ఏంటా అని ప్రశ్నించుకుంటున్నారు.

News June 8, 2024

యర్రగొండపాలెం: వేగినాటి కోటయ్యగా పేరు మార్పిడి

image

వైసీపీ అధికారంలోకి రాగానే యర్రగొండపాలెంలోని పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేత వేగినాటి కోటయ్య పేరును తొలగించి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరు మార్చారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా వేగినాటి కోటయ్య పేరును ఇవాళ పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేతలు మారుస్తున్నారు.

News June 8, 2024

చినగంజాం: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడిన ఘటన చినగంజాం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన కత్తి శ్రీనివాసరావు తన భార్య దుర్గపై అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను అక్కడికి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News June 8, 2024

ప్రకాశం: ఆ స్థానాల్లో టీడీపీ, వైసీపీలకు గెలుపు అందని ద్రాక్ష

image

ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాలలో వైసీపీ, వైపాలెంలో టీడీపీ ఇంతవరకు ఖాతాలు తెరవలేదు. 2009లో డీలిమిటేషన్‌లో కొత్తగా వైపాలెం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఒకసారి, మూడుసార్లు వైసీపీ గెలిచింది. అలాగే చీరాలలో వైసీపీ వచ్చాక జరిగిన మూడు ఎన్నికలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. ఇక పర్చూరులోనూ వైసీపీకి ఆశాభంగమే ఎదురైంది.

News June 8, 2024

ప్రకాశం: నవజాత శిశువు మృతిపై కేసు నమోదు

image

కురిచేడులోని తాగునీటి చెరువులో నవజాత శిశువు మృతదేహం పడేసిన విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎస్సై చెప్పారు. ఎవరు ఆ మృతదేహాన్ని చెరువులో పడేశారు. అసలు మృతదేహం ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News June 7, 2024

ప్రకాశం: వైసీపీ కార్యకర్తలకు అండగా కమిటీ ఏర్పాటు

image

వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా జంకే వెంకట్ రెడ్డి, కమిటీ ఇన్‌ఛార్జ్‌గా చెవిరెడ్డి, కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి బాలినేని, ఆదిమూలపు సురేశ్, అన్నా రాంబాబు, తాటిపర్తి చంద్రశేఖర్‌ ఉన్నారు. వీరు న్యాయపరంగా, ఆర్థికంగా బాధితులకు అండగా ఉంటారని జగన్ తెలిపారు.