Prakasam

News June 7, 2024

అద్దంకిలో భారీ చోరీ

image

అద్దంకిలోని ఆయిల్ మిల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం, రూ.2.25 లక్షలు నగదు, 3 రకాలైన డైమండ్స్‌ను దోచుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బెల్లం రాజేశ్ ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటుండగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. ఇంటి యజమాని తాళాలు పగలగొట్టి ఉండటం చూసి రాజేశ్‌కి సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 7, 2024

యర్రగొండపాలెంలో TDPని దెబ్బకొట్టింది ఇవే

image

రాష్ట్రంలో TDP ప్రభంజనం వీసినప్పటికీ వై.పాలెంలో గెలవలేకపోవటం పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే TDP గెలుపును నోటా, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు దెబ్బతీశాయని చెప్పవచ్చు. YCP అభ్యర్థి చంద్రశేఖర్ 5,200 ఓట్లతో గెలిచారు. కాగా నోటాకు 2,222 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అజితారావుకు 2,166 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు పడిన ఓట్లు దాదాపు టీడీపీవే అని మా గెలుపును దెబ్బతీశాయని పలువురు అంటున్నారు.

News June 7, 2024

TDP ప్రభుత్వంలో మార్కాపురం జిల్లా.?

image

వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ప్రజల ఆకాంక్ష. జిల్లాలో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీనినే TDP ఆయుధంగా తీసుకొని అధికారం చేపడితే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. దీంతో ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుందని ప్రజలు ధీమాగా ఉన్నారు. మరి TDP ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా!

News June 7, 2024

ప్రకాశం జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫలితాల్లో TDP పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 12 నియోజకవర్గ స్థానాల్లో పదింటిలో TDP జెండా ఎగరేసింది. ఇప్పుడు జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనేదే చర్చ. గొట్టిపాటి రవి 5 సార్లు MLA కాగా, ఈసారి మంత్రి పదవి ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి సామాజికవర్గాల వారిగా పరిశీలించి చంద్రబాబు ఎవరిని కేబినేట్‌లోకి చేర్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

News June 7, 2024

మార్టూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మార్టూరులోని శ్రీవిగ్నేశ్వర కూరగాయల మార్కెట్ సమీపంలోని తండాలో నివాసం ఉంటున్న మూడావత్ బాలనాయక్ (60) అనుమానాస్పదంగా గురువారం మృతి చెందాడు. బాలనాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటూ వైసీపీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేయడం వల్లే కక్ష్యతో బాలనాయక్‌ను హత్య చేసి వేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 7, 2024

టంగుటూరు: 840 పొగాకు బేళ్లు కొనుగోలు

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో ధర కేజీ రూ.261.29 పలికిందని వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పొందూరు ప్లాస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 900 పొగాకు బేళ్లు తీసుకురాగా 840పొగాకు బేళ్లు కొనుగోలు అయ్యాయని పేర్కొన్నారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.332, కనిష్ఠ ధర రూ.205 పలికిందని చెప్పారు. ఈ వేలంలో మొత్తం 40 మంది వ్యాపారులు పాల్గొన్నట్లు వివరించారు.

News June 6, 2024

సంతమాగులూరు: తంగేడిమల్లిలో YSR విగ్రహం ధ్వంసం

image

సంతమాగులూరు మండలంలోని తంగేడిమల్లిలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం పాక్షికంగా ధ్వంసం చేశారు. గ్రామం సమీపాన ఉన్న వైఎస్సార్ విగ్రహం చేతిని దుండగులు విరగగొట్టారు. అలాగే గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.

News June 6, 2024

ముత్తుములను గెలిపించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అత్యధికులు ఈసారి TDPకే వేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆ ఓట్లే TDPని గెలిపించాయి. ఇక్కడ ముత్తుముల అశోక్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 973 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గిద్దలూరు నియోజకవర్గంలో చెల్లుబాటు అయిన ఓట్లు 3,449. అందులో TDP అభ్యర్థికి 2,271రాగా, YCPకి 1,130 ఓట్లు వచ్చయి. దీంతో అశోక్ రెడ్డి గెలుపులో ఓట్లు కీలకం అయ్యాయి.

News June 6, 2024

ప్రకాశం: జగన్ ఓటమి తట్టుకోలేక ఆగిన గుండె

image

వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లికి చెందిన సైకం లక్ష్మమ్మ జగన్మోహన్ రెడ్డి ఓటమిని తట్టుకోలేక బుధవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు వైసీపీలో చురుగ్గా పాల్గొనే వారని తెలిపారు.

News June 6, 2024

కురిచేడు: రిజర్వాయర్‌లో పసికందు మృతదేహం

image

కురిచేడు మండలం అట్లపల్లి రిజర్వాయర్‌లో పసి కందు మృతదేహం బయటపడింది. బుధవారం సాయంత్రం చెరువు పక్కనే పొలం పనులు చేసుకునే వారు కట్టమీద వెళుతుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలు చెరువు కట్టమీద అనుమానస్పదంగా తిరుగుతూ బిడ్డను వదిలేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్‌ఏపీ రక్షిత నీటి పథకం సిబ్బంది వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చెరువును శుభ్రం చేశారు.