Prakasam

News June 4, 2024

పర్చూరులో టీడీపీ జెండా

image

ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి యడం బాలాజీపై 22,221 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ నాలుగు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు)ను సొంతం చేసుకుంది.

News June 4, 2024

గిద్దలూరును కైవసం చేసుకున్న టీడీపీ

image

ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 2వేలకు పైగా ఓట్లతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ మూడు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం)ను సొంతం చేసుకుంది.

News June 4, 2024

ప్రకాశం జిల్లాలో మరో టీడీపీ నేత గెలుపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైకిల్ జోరు చూపిస్తోంది. మార్కాపురం నుంచి టీడీపీ నేత కందుల నారాయణరెడ్డి గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి అన్నా రాంబాబుపై 16746 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఇప్పటివరకు అధికారికంగా రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాగా సంతనూతలపాడులో బి.ఎన్.విజయ్ గెలిచిన విషయం తెలిసిందే.

News June 4, 2024

సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి గెలుపు

image

ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. సంతనూతలపాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఏన్ విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి, మంత్రి మేరుగా నాగార్జునపై 30,385 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంతనూతలపాడును టీడీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 4, 2024

ఒంగోలు: ఆధిక్యంలో మాగుంట

image

ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధిక్యంలో కొనసాగున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మాగుంట 13,869 ఓట్లతో లీడింగులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉన్నా ఫలితాలు పూర్తయ్యే వరకు ఎవరు గెలుస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

News June 4, 2024

ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ లీడింగ్

image

ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 12 స్థానాలకు టీడీపీ -8, వైసీపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. దర్శి, గిద్దలూరు, వై.పాలెం, కనిగిరిలో ఇప్పటివరకు వైసీపీ లీడింగ్ లో ఉండగా, అద్దంకి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల, పర్చూరులో టీడీపీ ముందంజలో ఉంది.

News June 4, 2024

ఒంగోలులో ఆధిక్యంలో టీడీపీ

image

ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకబడి ఉన్నారు.

News June 4, 2024

ఒంగోలు: కొత్త బైకుపై సంతోషంగా వెళ్తున్న వ్యక్తి మృతి

image

ఒంగోలుకు చెందిన వ్యక్తి కొత్తపల్లి జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైకుతో ఢీకొట్టాడు. దీంతో నిలం శివ (35)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ.. నేడు తన స్వగ్రామమైన ఒంగోలుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కొత్త బైకు తీసుకుని సొంతూరికి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

News June 4, 2024

ప్రకాశం: ఓట్ల లెక్కింపులో ఇవే కీలకం

image

ప్రకాశం జిల్లాలో ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. ఉ. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా MP, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపడతారు. నియోజకవర్గాలుగా వీటిని పరిశీలిస్తే వై.పాలెం (1,549), దర్శి(1,837), S.N.పాడు (1905), ఒంగోలు (4,577), కొండపి (1,794), మార్కాపురం (2,764), గిద్దలూరు (3,550), కనిగిరి (2,480) ఓట్లు పోలైనాయి. ఫలితాల్లో ఇవి కీలకం కానున్నాయి.

News June 3, 2024

ఫలితాలపై ఫేక్ వార్తలు సృష్టిస్తే చర్యలు : కలెక్టర్

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫేక్ వార్తలపై పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫేక్ వార్తలను సృష్టించి ప్రజలను, రాజకీయ పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.