Prakasam

News June 30, 2024

ప్రకాశం: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ ‌న్యూస్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అర్హులైన SC, ST, BC అభ్యర్థుల నుంచి ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు యం.అంజల తెలిపారు. జులై 8లోగా దరఖాస్తులు చేసుకున్నవారికి 10వ తేదీ నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో 672 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News June 29, 2024

కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?

image

కనిగిరిని 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారుకొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరవు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఓప్పందం కుదుర్చుకున్నారని చరిత్ర.

News June 29, 2024

దర్శి: కేవీకే కోఆర్డినేటర్‌గా సీనియర్ శాస్త్రవేత్త

image

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాధ్యతలను సీనియర్ శాస్త్రవేత్త డా.జీ.రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేవీకే బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని భరోసా కల్పించారు. ఈయన గతంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో సమన్వయకర్తగా విధులను నిర్వహించారు.

News June 29, 2024

 ఔట్‌‌సోర్సింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

కారాగార సంస్కరణలు, చట్టపరమైన హక్కులు, కౌన్సిలింగ్, వయోజన విద్య మొదలైన సేవల్లో పేరుపొంది, సామాజిక సేవలతో కలిసి పనిచేసే సిబ్బంది ఎంపికకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అనుభవం ఉన్నవారు తమ విద్యార్హతలతో జులై 5లోపు కలెక్టర్‌ కార్యాలయానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

News June 29, 2024

డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి దోర్నాల నీటి సమస్య

image

ప్రకాశం జిల్లా దోర్నాలలో నెలకొన్న నీటి సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. నిన్న <<13526596>>మంచి నీటి కోసం మహిళలు రోడ్డెక్కిన<<>> విషయం తెలిసిందే. విషయాన్ని యర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గౌతమ్ రాజ్ ద్వారా తెలుసుకుని సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి ట్యాంకర్లతోనైనా నీటి ఎద్దడిని తీర్చేందుకు RWS అధికారులు సన్నద్ధం అయ్యారు.

News June 29, 2024

ప్రకాశం: TDP ఎంపీ, YCP ఎమ్మెల్యే ఒకే వేదికపై

image

జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పక్కపక్కనే కూర్చుని, ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారైనప్పటికీ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో సమావేశం సజావుగా సాగిందని అధికారులు తెలిపారు.

News June 29, 2024

త్రిపురాంతకం: దొంగలను పట్టుకున్న గ్రామస్థులు

image

త్రిపురాంతకం మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో పొలాల్లో ఉన్న మోటార్ బోర్ల కేబుల్ కత్తిరించి రాగి తీగను దొంగలించి తీసుకుని వెళ్తున్న దొంగలను శనివారం స్థానికులు పట్టుకున్నారు. అనంతరం గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి దొంగలను అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

ఆది మూలపు సురేశ్‌పై ఫైర్ అయిన మంత్రి స్వామి

image

మాజీ మంత్రి ఆది మూలపు సురేశ్‌పై మంత్రి స్వామి ఫైర్ అయ్యారు. YCP నాయకులపై తాము అక్రమ కేసులు పెడుతున్నామని సురేశ్ ఆరోపించడం సిగ్గుచేటని విమర్శించారు. ‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా, SC ఎమ్మెల్యేనైన నన్ను సభలో దాడిచేసినా, SC, ST సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా నోరు మెదపలేదు. అటువంటి నీవా ఇప్పుడు నీతులు మాట్లాడేది’అని మంత్రి డోలా మాజీ మంత్రి సురేశ్‌ను ప్రశ్నించారు.

News June 29, 2024

రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

image

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

News June 29, 2024

చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ సస్పెండ్

image

చీమకుర్తిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా చీమకుర్తికి వచ్చిన CI దుర్గాప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల చీమకుర్తి MRO ఆఫీస్ వద్ద ఓ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్‌పై బయటకు వెళ్లి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని దగ్గర లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పించినట్లు అభియోగాలు రాగా..  విచారణ జరిపి ఉన్నతాధికారులు నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.