India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం కేసును బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో 36 గంటల్లోనే ఛేదించారు. ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన 21 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్లూస్ లేనప్పటికీ, కేసును సవాల్‌గా తీసుకొని త్వరితగతిన ఛేదించారని అన్నారు.
ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాల స్కిల్ హబ్ సెంటర్‌లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ తెలిపారు. ఆసక్తిగల యువకులు వచ్చే నెల 4వతేదీలోగా ఐటిఐ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సోలార్ ప్యానల్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ అందిస్తామన్నారు.
సంతమాగులూరు మండలంలోని పుట్ట వారిపాలెం జంక్షన్‌లో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ పుట్టవారి పాలెంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడుకి స్వల్ప గాయాలు కాగా వాహనం ధ్వంసమైంది.
మార్కాపురం జిల్లా ప్రకటనపై ఊహాగానాలు వస్తున్న సందర్భంగా మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురంను ప్రత్యేక జిల్లాను చేస్తామని ప్రకటించారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో మార్కాపురంను జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.
జిల్లా లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీలో తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి గ్రూప్-4, టెక్నికల్, క్లాస్-4 పోస్టుల అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకాశం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 30వ తేదీలోగా జాబితాను పరిశీలించుకోవాలని కోరారు.
జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఎన్టీఆర్ భరోసా కింద ప్రకాశం జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించిన 2,91,524 మందికి పింఛన్ నగదు అందనుంది. కొత్తగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెంచిన మొత్తం నగదు అందించేందుకు గాను 199.07 కోట్ల రూపాయల నగదు మంజూరైంది. ఈ నగదును బ్యాంకుల నుంచి ఈ నెల 29వ తేదీన డ్రా చేసుకుని ఇంటింటికీ సచివాలయ ఉద్యోగుల ద్వారా 1వ తేదీన పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శిగా జరుగుమల్లి జడ్పీ పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఉప్పలపాడు పాఠశాల హెచ్ఎం వెంకట్రావును రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో జరిగే అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు తన అధీనంలో ఉంటాయని తెలిపారు.
మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ మహిళతో ‘నాకు సహకరించకుంటే నీ డిప్యూటేషన్ రద్దు చేస్తానని’ బెదిరించాడు. గత కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులతో విచరణకు ఆదేశించారు. దీంతో నాగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.
పోస్టల్ బ్యాలెట్‌లకు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలోచ్చిన ముగ్గురు టీచర్లతో పాటు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందున వేటుపడిన మరో టీచర్‌ను మళ్లీ వీధుల్లోకి తీసుకున్నట్లు డీఈఓ సుభద్ర వెల్లడించారు. దర్శి, ముండ్లమూరు మండలాల్లో పనిచేసే ముగ్గరు టీచర్లు , సింగరాయకొండలోని పాకాల జడ్పీలో పనిచేస్తున్న టీచర్‌ను విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. వారిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.