India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల పోలీసులందరికీ అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలోని హైస్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఎంఈవోలు, ఉప విద్యాధికారులను సంప్రదించాలన్నారు. ఏమైనా లోపాలుంటే ఆధారాలతో ఈనెల 29వ తేదీలోపు సమర్పించాలని ఆమె కోరారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి నిర్వహించిన వీడియో కార్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. నూరు శాతం పంపిణీ తొలిరోజే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని చెప్పారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని దేవనగరం గ్రామ సమీపంలోని గోతిలో చిక్కుకున్న చిరుతను 24 గంటలు శ్రమించి ఎట్టకేలకు అధికారులు బంధించారు. ఫీల్డ్ డైరెక్టర్ డీఎన్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు చిరుతను అటవీశాఖ అధికారులు గురువారం తరలించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుచుకున్నారు.
జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ చేయగలిగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌తో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
జిల్లా అభివృద్ధిలో MSMEల పాత్ర కీలకమని బాపట్ల జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ చెప్పారు. గురువారం బాపట్ల జిల్లాలో అంతర్జాతీయ సూక్ష్మ, మధ్య తరహా, చిన్న పరిశ్రమల వేడుకలు నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో చిన్న పరిశ్రమల ట్యాక్స్ కీలకంగా మారిందన్నారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)పరీక్షలో ఎంపికై స్కాలర్షిప్ అందని విద్యార్థులు వెంటనే తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానించాలని డీఈవో సుభద్ర తెలిపారు. 2019, 20, 21, 22 సంవత్సరాల్లో ఉపకార వేతనానికి ఎంపికై స్కాలర్షిప్ జమ కాని విద్యార్థుల జాబితా వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. హెచ్‌ఎంలు ఆయా విద్యార్థుల బ్యాంక్ అకౌంటుకు ఆధార్ అనుసంధానించేలా చూడాలన్నారు.
పెన్షన్ల పై మంత్రి స్వామి అధికారులకు కీలక సూచనలు చేశారు. వెలగపూడి సచివాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మరో 3 రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జులై 1వ తేదీ లోపే పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ఇందులో జాప్యం జరిగితే చర్యలు తప్పవన్నారు.
అద్దంకి మండలం గోవాడ గ్రామంలో యువకుడు ఎలుకల మందు తిన్న విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదన్న ఆవేశంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగాడు. అతడు ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎలుకల మందుని మద్యంలో కలిపి తాగుతూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. వెంటనే యువకుడిని కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా 38వ కలెక్టర్‌గా తమీమ్ అన్సరియా గురువారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.