India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అద్దంకి పట్టణంలోని భవాని సెంటర్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అతణ్ని అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సింది.
బావను హత్య చేసిన బామ్మర్దికి యావజ్జీవ శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో 2017లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బావ రమణయ్యను బావమరిది శ్రీనివాసులు కత్తితో హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువవ్వడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత ఓ గోతిలో చిక్కుకుపోయింది. అటుగా వెళ్లిన మేకల కాపరులు పులి అరుపులు విని మొదట బయపడ్డారు. తరువాత ధైర్యం చేసి దానిని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుంతపై వలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చీకటి పడటంతో చిరుతను బంధించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అర్ధవీడులోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ టీచర్ వెంకట రమణారెడ్డిని సస్పెండ్ చేసినట్లు హెచ్‌ఎమ్ అబ్దుల్ సత్తార్ బుధవారం తెలిపారు. ఇటీవల పెంచుకున్న 9 ఏళ్ల పాపను కిరాతకంగా కొంతు కోసి హత్య చేసిన ఉదంతంలో ఉపాధ్యాయుడితోపాటు ఆయన భార్య పద్మావతి సైతం జైలు పాలయ్యారు. డీఈవో ఉత్తర్వుల మేరకు జూన్ 6 నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమలైనట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షకు జులై 1వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సుభద్ర తెలిపారు. ఈ పరీక్ష విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాలలో జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాగుంట ప్రధానిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు చర్చించనట్లు ఆయన వివరించారు.
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లాలో 2,724 మంది పరీక్షరాయగా.. 2,619 మంది పాసయ్యారు. జిల్లాను రాష్ట్రంలోనే టాప్-1లో నిలిపారు. బాలురు 96.04%, బాలికలు 96.03% ఉత్తీర్ణత సాధించారు. బాపట్ల జిల్లాలో 2,430 మంది పరీక్ష రాయగా.. 2,080 పాసయ్యారు. ఈ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. బాలురు 84.11%, బాలికలు 88.06% ఉత్తీర్ణత సాధించారు.
ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలో మేలిమి రకం పొగాకుకు బుధవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా వర్జీనియా రకం పొగాకు క్వింటాకు రూ.36,100 ధర పలికిందని టంగుటూరు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గత రెండురోజులుగా పొగాకు ధరలు క్రమంగా పెరుగుతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు అశాజనకంగా ఉండటంతో ఈ పంట సాగు చేసే పొలాలకు కౌలు ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లాలో 6,445 మంది పరీక్షలు రాయగా.. 2,709 మంది పాసయ్యారు. మొత్తం 42% మంది ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రంలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. అలాగే బాపట్లలో 2,782 మంది రాయగా.. 1,119 మంది పాసయ్యారు. 40% ఉత్తీర్ణులవ్వగా.. జిల్లా 20వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఒకేషనల్‌కు 884 మంది పరీక్ష రాయగా 442 మంది పాసయ్యారు.
పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.