Prakasam

News November 10, 2025

ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

image

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

News November 10, 2025

రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

image

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

News November 10, 2025

ప్రకాశమంతా ఒకటే చర్చ.. ఆ ప్రకటన వచ్చేనా?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మార్కాపురం జిల్లా ప్రకటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబు నేడు నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో జిల్లాల ఏర్పాటుపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లాగా, శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురంలో విలీనం చేస్తారా? లేదా అన్నది కూడా తేలే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

News November 10, 2025

ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

image

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.

News November 9, 2025

వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.

News November 9, 2025

ప్రకాశం జిల్లాకు CM రాక.. కారణమిదే!

image

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు 11న రానున్నారు. పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పీసీపల్లి మండలం లింగన్నపాలెం సమీపంలో 20 ఎకరాల భూమిలో రూ. 7కోట్లతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశారు. దీనిని నిర్మాణానికి గత నెల కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడంతో దీనిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

News November 9, 2025

ఒంగోలు: మీరు వెళ్లే బస్సు బాగుందా? లేదా?

image

వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. చాలా వాటిపై కేసులు నమోదు చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో సంతనూతలపాడు పోలీస్‌లు శనివారం ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని తీశారు. మీరు వెళ్లే స్కూల్/కాలేజీ బస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 9, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.

News November 9, 2025

‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.

News November 9, 2025

మత్స్యకారులకు రూ.72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

image

మంగళగిరిలోని మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి దామచర్ల సత్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పురోగతిని అధికారులు వివరించారన్నారు. మొంథా సైక్లోన్ సమయంలో ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు 26 బోట్లకు అందించిన రూ.72 లక్షల నష్టపరిహారానికి మారిటైం బోర్డు ఆమోదించిందన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు.