India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీరాల, బాపట్ల పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు పర్యాటకులను నిలిపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నుంచి నాలుగు వారాల పాటు విద్యాప్రవేశం కార్యక్రమం అమలు జరుగుతుందని డీఈవో డి.సుభద్ర పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సమగ్రశిక్ష సంస్థ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నూరుశాతం విద్యార్థుల నమోదు చేయించాలన్నారు. పర్యవేక్షణ కోసం దీక్ష యాప్‌ను వినియోగించుకోవాలన్నారు
జూన్ నెల పూర్తి కావొస్తున్న ప్రకాశం జిల్లాలో వర్షాల జాడ లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో 90 వేల హెక్టార్లకు పైగా పంటలు జిల్లాలో సాగవుతుంటాయి. ఇందులో అత్యధికంగా 70-75 వేల హెక్టార్లలో కంది వేస్తుండగా, కొన్ని చోట్ల సజ్జ పండిస్తారు. ప్రస్తుతం కంది, పొగాకుకు మంచి ధరలు ఉండటంతో ఎక్కువ మంది వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఏ పంటలు వేయాలన్నా వరుణిడి కోసం రైతన్నలు ఎదురుచూపులు తప్పడం లేదు.
కనిగిరికి చెందిన రసూల్ (32) అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రసూల్ కొన్నేళ్ల క్రితం చుక్కాపూర్ అనే గ్రామానికి వలసవెళ్లాడు. ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ ఘన్‌పూర్ గ్రామం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మరణించాడు.
ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్ గా తమీమ్ అన్సారియాను నియమితులైన విషయం తెలిసిందే. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అన్సారియా గతేడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె భర్త 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మనజీర్ జిలానీ సామూన్ ప్రస్తుతం శ్రీకాకుళం కలెక్టర్‌గా ఉన్నారు. గతేడాది ఒకేసారి ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చారు. తాజాగా అన్సారియా ప్రకాశం కలెక్టర్‌గా నియమితులయ్యారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేస్తున్న మతతత్వ, కార్పొరేట్ విధానాలపై దేశవ్యాప్తంగా ఐక్యపోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోగలమని సీపీఎం రాష్ట్ర నాయకుడు వై.సిద్దయ్య తెలిపారు. చీరాలలో జరుగుతున్న సీపీఎం జిల్లా శిక్షణ తరగతులలో ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య శక్తులను కలుపుకొని పోరాటాలు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని వివరించారు.
గత ఐదేళ్లలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తక్షణమే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలన్నారు.
వేటపాలెంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. అందులో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీరాల పట్టణంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ థియేటర్ సమీపంలో నడిరోడ్డుపై గుర్తుతెలియని దుండగుడు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడిని కంచర్ల సంతోశ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అద్దంకి మండలంలో శనివారం 33 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిమ్మాయపాలెం పొలాల్లో కొందరు శుక్రవారం రాత్రి మద్యం తాగుతుండగా ప్రత్యర్థి వర్గీయులు వారిపై కర్రలు, రాడ్లతో దాడిచేసి గాయపరిచారు. క్షతగాత్రుడు ఎం.శివకృష్ణ ఫిర్యాదు మేరకు 33 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.