Prakasam

News May 27, 2024

ప్రకాశం: చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

image

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇంకొల్లు మండలం నలతోటివారిపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. గంగవరం గ్రామానికి చెందిన యాడికిరి సుబ్రహ్మణ్యం (50) చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లిఖార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

ప్రవర్తన మారకుంటే తాట తీస్తాం: ప్రకాశం పోలీసులు

image

ఎస్పీ సుమిత్ గరుడ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు
సోమవారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోవాలని, సత్ప్రవర్తన ఒక్కటే మంచి మార్గమన్నారు.

News May 27, 2024

పర్చూరు: రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయానికి మృతి

image

ఇంకొల్లు మసీదు కాంప్లెక్స్‌లో చికెన్ పకోడీ దుకాణంలో పనిచేస్తున్న షేక్ నాగూర్ వలి (40) సోమవారం మృతి చెందారు. నాగూర్‌వలి చికెన్ దుకాణంలో పనిచేస్తూ షాపులోనే ఉంటున్నాడు. రోజు లాగానే యాజమాన్యం వచ్చి చూసేసరికి బల్లపై పడుకున్న వ్యక్తి కింద పడి ఉన్నాడు. దీంతో యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇంకొల్లు ఎస్సై మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

News May 27, 2024

ప్రకాశం జిల్లాలో సర్వీసు ఓట్లు 6,890

image

జిల్లాలో సైనిక దళాల్లో పనిచేసే వారు 6,677 మంది ఉండగా, వారి కుటుంబ సభ్యులు 173 మందికి కూడా ఓటు హక్కు ఉంది. ఇప్పటికే వారందరికీ పోస్టల్ బ్యాలెట్లను తపాలా శాఖ ద్వారా పంపారు. వారు ఓటేసి తిరిగి పోస్టల్ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు, లేదా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ అడ్రసుకు పంపాలి. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రానికి 1477 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు సమయానికి వస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు.

News May 27, 2024

ప్రకాశం: పది మార్కుల మెమోల్లో తప్పుల సవరణకు అవకాశం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోల్లో దొర్లిన పొరపాట్లను సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల మెమోల్లోని తప్పులు, పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని డీఈవో సుభద్ర చెప్పారు. తప్పుల సవరణకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలోని మాణిక్యాంబ 9919510766 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News May 27, 2024

ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ(64) హైదరాబాద్ లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ప్రకాశం పంతులుకు ఇరువురు కుమారులు. వారిలో హనుమంతరావు ఒకరు కాగా.. హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ప్రకాశం పంతులు కుటుంబంలో దీనితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 27, 2024

ప్రకాశం: బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం కంబంపాడు గ్రామానికి చెందిన పరోపోగు జయపాల్ (32) బైకుపై త్రిపురాంతకం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో దూపాడు వద్ద బైకుసు కుంట వైపు నుంచి వినుకొండవైపు వెళుతున్న లారీ ఎదురుగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వినుకొండకు తరలిస్తుండగా మృతి చెందాడు. లారీ డ్రైవరును ఎస్సై సాంబశివయ్య అదుపులోకి తీసుకున్నారు.

News May 27, 2024

ప్రకాశం: తగ్గిన నిమ్మ ధరలు.. కిలో రూ.5

image

జిల్లాలో నిమ్మధరలు వారం రోజులుగా భారీగా పడిపోయాయి. కిలో రూ.60 నుంచి రూ.30లకు పడిపోయింది. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. కనిగిరి కమీషన్ మార్కెట్‌కు రోజుకు 10 లారీల సరకు వచ్చేది కాగా, ఇప్పుడు 2, 3 లారీలకు పరిమితమైంది. మార్కాపురం స్థానిక మార్కెట్లకు వెళ్తున్న రెండోరకం నిమ్మకు రూ.5లకు మించి లేదు. దీంతో కోతలు ఆగిపోయాయి. అకాల వర్షంతో ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News May 27, 2024

ప్రకాశం జిల్లాలో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు

image

జిల్లా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 2.14 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు అవసరమైన 40వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 1,500 క్వింటాళ్ల కందులు, 5వేల క్వింటాళ్ల మినుములు, 1,200 క్వింటాళ్ల పెసలు ఆర్బీకేల్లో రైతులకు అందబాటులో ఉంచారు.

News May 26, 2024

రామతీర్థం జలాశయంలో యువకుడు గల్లంతు

image

చీమకుర్తి మండలం రామతీర్థం జలాశయంలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తాళ్లూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 9 మంది యువకులు జలాశయాన్ని చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో యాతం మణికంఠ(22) అనే యువకుడు ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.