Prakasam

News June 22, 2024

ప్రకాశం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలంలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బ్రహ్మనాయుడు వివరాల మేరకు వేటపాలెం మండలం రావురు గ్రామానికి చెందిన ఎండ్లూరి ఎలీషా(45) ఉప్పుగుండూరు నుంచి బైక్‌పై ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News June 22, 2024

త్రిపురాంతకం: గుండెపోటుతో VRO మృతి

image

త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామ VRO బోర్ర తిరుమలయ్య(52) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిబ్బందికి తెలియజేశారు. సిబ్బంది వెంటనే 108 సహాయంతో వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.

News June 22, 2024

కొండపి: టైలరింగ్, కంప్యూటర్ కోర్సులకు ఉచిత శిక్షణ

image

కొండపిలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులలో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, స్కిల్ హబ్ నిర్వాహకులు గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాస్ లేక ఫెయిల్ లేదా ఆ పైన చదివిన వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 25వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News June 22, 2024

సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్

image

సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ శాఖ అధికారులు, మెడికల్ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాలలో మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలని, నీటి కుంటల వద్ద ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.

News June 21, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

వేటపాలెం: గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

వేటపాలెం మండలం రామాపురం తీరం వద్ద నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాలకి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన యువకులలో నితిన్ (26), అమలరాజ (27), కిషోర్ (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. నాని (23) అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News June 21, 2024

కందుకూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రాకి మాతృ వియోగం

image

మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుర్రా లక్ష్మమ్మ వయోభారం వలన శుక్రవారం మరణించారని బుర్రా అనుచరులు తెలిపారు. కాగా శనివారం ఉదయం 10:00 గంటలకు టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు సూచన మేరకు తెలియజేశారు.

News June 21, 2024

వేటపాలెం: సముద్ర తీరం వద్ద తీవ్ర విషాదం

image

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. తీరానికి మూడు మృతదేహాలు కొట్టుకు రాగా నాలుగో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

చీరాల: యువతిపై అత్యాచారం.. ఆపై హత్య?

image

చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 21, 2024

జిల్లా ప్రజలకు ప్రకాశం పోలీసులు హెచ్చరిక

image

ప్రకాశం జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ వాల్ పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా గంజాయి ఇతరత్రా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు సమాచారం ఉంటే ఇవ్వాలని, పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వాటిపై నిఘా ఉంటుందన్నారు.