Prakasam

News May 24, 2024

మార్కాపురం: విద్యుత్ షాక్‌తో ఏడు పాడి గేదెలు మృతి

image

విద్యుదాఘాతంతో 7 పాడి గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పలువురి రైతులకు చెందిన 7 పాడి గేదెలు శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గేదెల విలువ రూ.5లక్షలు ఉంటుందని రైతులు వాపోయారు.

News May 24, 2024

ప్రకాశం: ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ.. తమ్ముడు మృతి

image

ఆస్తి కోసం అన్నదమ్ములు ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన ఘటన శింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అన్నదమ్ముల మధ్య మాట మాట పెరిగి పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తమ్ముడు చొప్పర శివశంకర్‌(33) మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News May 24, 2024

అద్దంకిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

అద్దంకి మండలంలోని శ్రీనివాస్ నగర్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న మొక్కజొన్న లోడు ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 24, 2024

ప్రకాశం: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. 43 పరీక్ష కేంద్రాల్లో 22,366 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం 15,291, ద్వితీయ సంవత్సరం 7,075 మంది విద్యార్థులు ఉన్నారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని ఆర్ఐఓ స్పష్టం చేశారు.

News May 23, 2024

ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇలా

image

ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులోని రైజ్ కాలేజీలో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు విడివిడిగా గదులు కేటాయించారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన గదిలో 28 టేబుళ్లు ఉంటాయి. 14 టేబుళ్లు అసెంబ్లీ, 14 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్కు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు అసెంబ్లీకి, 4 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఏర్పాటు చేస్తున్నారు.

News May 23, 2024

కారంచేడు: తిరుపతికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

image

కారంచేడుకు చెందిన పొత్తూరి వెంకట శివసుబ్రహ్మణ్యం భార్య రేఖ ప్రియాంక(32), పిల్లలు నిక్షిత్ (5) తేజవర్ధన్ (3)తో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు కుమారిడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కారులో తిరుమలకు వెళ్లారు. దైవదర్శనం అనంతరం వారు తిరిగి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయలుదేరారు. గురువారం వేకువజామున కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ ప్రియాంక మృతిచెందగా, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 23, 2024

ప్రకాశం: నిర్మాతగా మారిన మహిళా రైతు

image

కొనకనమిట్ల మండలం పెదారికట్ల చెందిన సాధారణ ఒక రైతు కుటుంబంలో పుట్టిన నరసమ్మ ఒక సినిమాకు నిర్మాతగా మారింది. కరోనా కారణంగా అదే ఊర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ హోటల్ పెట్టి జీవనం సాగించేది. ఆమెకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. దీంతో ఓ సినిమా తీయాలనే ఆశ కూడా ఉండేది. తన 45 సంవత్సరాలుగా రూపాయి రూపాయి కూడబెట్టింది. ప్రస్తుతం ఆమె ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

News May 23, 2024

ప్రకాశం: కారు, పాలవ్యాను ఢీ.. ఒకరు మృతి

image

ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం ఉప్పలపాడు, పామూరుకు చెందిన వారికి రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు, పాలవ్యాను ఢీకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే చనిపోయాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

ప్రకాశం: స్నానం చేస్తుండగా వీడియో.. యువతి ఆత్మహత్యాయత్నం

image

బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా HYDలో నివాసం ఉంటోంది. ఆమె స్నానం చేస్తుండగా ఓ యువకుడు ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. కొద్దిరోజులకు ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. యువతి రూ.40 వేలు ఫోన్ పే ద్వారా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని వీడియో తొలగించాలని కోరింది. అవమానానికి గురై బస్సులో ఇంటికి వస్తూ పురుగుమందు తాగింది. ఆమెను ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

కొండపిలో రికార్డు ధర పలికిన పొగాకు

image

ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర కిలో రూ.320 పలికిందని, కొండపి బోర్డు చరిత్రలోనే రికార్డు ధర అని వేలం నిర్వహణాధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. చతుకుపాడు, కె. అగ్రహారం, మూగచింతల, గుర్రప్పడియ, నెన్నూరుపాడు గ్రామాలకు చెందిన రైతులు 1077 బేళ్లు తీసుకొనిరాగా 1018 బేళ్లు కొనుగోలయ్యాయి.