India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతీ ఏటా నిర్వహించే పోలీసు అమర వీరుల స్మారకోత్సవాలు సోమవారం నుంచి అట్టహాసంగా ప్రారంభమవుతున్నాయని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను, త్యాగాలను కొనియాడుతూ ఈ స్మారకోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసుశాఖ సిద్ధమయ్యిందన్నారు. ఈనెల 21 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో స్మారకోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కార్తికమాసం ప్రారంభానికి 15రోజుల ముందు జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఒడిశా రాజులు నిర్మించిన దేవాలయం కావడంతో ఆ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం ఇక్కడ దీపం వెలిగించారు. అప్పటి సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని, ఆశ్వయుజ మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి కార్తిక మాసం చివరి వరకు 45రోజులు దీపం వెలిగిస్తామని అర్చకులు చెప్పారు. ఈ దీపం గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఆయా తీర ప్రాంత మండలాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. రణస్థలానికి 80088 03800, ఎచ్చెర్లకు 87900 08399, శ్రీకాకుళంకు 83414 93877, గార 9440814582, పొలాకి 9100997770 నంబర్లు కేటాయించారు.
తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలు జారీ చేశారు. వీరంతా ఆయా తీర ప్రాంత మండలాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మండలాలైన రణస్థలానికి 80088 03800, ఎచ్చెర్లకు 87900 08399, శ్రీకాకుళంకు 83414 93877, గార 9440814582, పొలాకి 9100997770 నంబర్లు కేటాయించారు.
శ్రీకాకుళం జిల్లాలో సిక్కోలు సంబరాలు, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ముందుగా రెండు లేదా మూడు రోజుల పాటు ఏర్పాటు చేయాలని, ప్రజల స్పందన చూసి ఫెస్టివల్ పొడిగింపు ఉంటుందని చెప్పారు. జిల్లాలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసి బస్సులు నడపాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రబీ సీజన్ (2024-25) కు సంబంధించి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డీలర్లకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు త్వరలో విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించేందుకు గాను చర్యలు తీసుకుంటున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఊరిటి సాయికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్‌లో దివ్యాంగులు ఉద్యోగ కల్పన కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. త్వరలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కారం చూపాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా ఫిర్యాదులు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, ఆయా ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ప్రజల నుంచి మొత్తం 11 వినతులు స్వీకరించామన్నారు.
శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు బెంగళూరులో మృతి చెందారు. పోలీసుల కథనం..గొల్లబాబు(45), లక్ష్మి పైతమ్మ (40) భార్యాభర్తలు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. వీరితో పాటు గణేశ్ (20) ఓ బిల్డింగ్‌లో పనికి దిగారు. గణేశ్‌తో పైతమ్మకు వివాహేతర సంబంధం ఉందని గొల్లబాబు బుధవారం రాత్రి ఇరువురిని హత్య చేశాడు. గురువారం ఉదయం అతను ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ లోకేశ్ తెలిపారు.
ఇటీవల బహిరంగ మార్కెట్‌లో వంట నూనె ధరలు పెరిగినందున సామాన్య ప్రజలకు వంట నూనె ధరలు సరసమైన ధరలకు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పామోలిన్ ఆయిల్ 1లీ రూ.110/-, సన్ ఫ్లవర్ ఆయిల్ 1లీ రూ.124/- విక్రయించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 84 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి తక్కువ ధరలో నూనె ప్యాకెట్లను తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.