India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MSc(మైక్రోబయాలజీ)చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జులై 27, 29, 30, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
వీరఘట్టం మండలం తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా.. నిరుద్యోగ యువత 88 మంది హాజరయ్యారు. ఇందులో 16 మందిని ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సుధా తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ డిగ్రీ చివరి ఏడాది 5వ సెమిస్టర్ ఇన్స్టంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు జూన్ 29 నుంచి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఈ పరీక్షకు అర్హులైన జాబితాను ఆయా కళాశాలలకు అధికారులు అందజేశారు. ఇంకా చెల్లించని విద్యార్థులు నేడు సాయంత్రం లోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.
పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖ-గుణుపురం మధ్య నడుస్తున్న రైలును శక్రవారం రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. పూండి- నౌపడ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
మెళియాపుట్టి మండలం తొవ్వూరుకు చెందిన ఎమ్మార్వో చలమయ్య(50) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన 2014-2018 వరకు అదే విధులు నిర్వహించారు. 2023 నుంచి సంతబొమ్మలి మండలంలో విధులు నిర్వహించారు. అనంతరం ఎన్నికల విధుల్లో భాగంగా సుబ్బవరానికి బదిలీ అయ్యారు. కాగా ఇటీవలె ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖపట్నానికి తరలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.