Srikakulam

News July 3, 2024

శ్రీకాకుళం: MBA విద్యార్థులకు అలర్ట్..

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA విద్యార్థులు(2022-23 బ్యాచ్) రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల(రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైంటేబుల్ విడుదలైంది. జులై 26, 27, 29, 30, 31 ఆగస్టు1, 2 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 3, 2024

ఈనెల 5న శ్రీకాకుళం జిల్లాకు విజయనగరం ఎంపీ

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈనెల 5న శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఇటీవల ఢిల్లీలో కలిశెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు మొదటిసారి వస్తున్న సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్త నుంచి కలిశెట్టి ఎంపీగా అత్యధిక మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే.

News July 3, 2024

శ్రీకాకుళం: M.Com పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం.కామ్ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల(రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. జులై 26, 27, 29, 30, 31 ఆగస్టు1, 2, 3 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 3, 2024

రేపు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు

image

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రముఖ గాయకుడు టీ.శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘంటసాల గీతాలు శరత్ చంద్ర ఆలపిస్తారు. అభిమానులు, సంగీత ప్రియులు హాజరు కావాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.

News July 3, 2024

శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే ఆఖరు

image

జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష రుసుము చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు జూలై 3వ తేదీ సాయంత్రంలోగా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు మొత్తం యూనివర్సిటీ మైగ్రేషన్ ఫీజుతో కలిపి 1,635 ఫీజులు చెల్లించాలి. జూలై 19వ తేదీ నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News July 3, 2024

టెక్కలి: ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి

image

టెక్కలి మండలంలోని కొండ భీంపురం గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. పెద్ద తామరపల్లి గ్రామానికి చెందిన పోలాకి మధు అలియాస్ వంశీ (30) అనే యువకుడు ట్రాక్టర్‌తో మట్టిలోడు తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పిడ్రైవర్ కూర్చునే ఇంజిన్ భాగం బోల్తా పడింది. దీంతో క్యాబ్లో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. ఈ మేరకు టెక్కలి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News July 3, 2024

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), SMVT బెంగళూరు(SMVB) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.08845 SRC- SMVB ట్రైన్‌ను జులై 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, నం.08846 SMVB- SRC ట్రైన్‌ను జులై 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News July 3, 2024

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ నేపథ్యం

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.

News July 3, 2024

శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

image

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 3, 2024

హత్రస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ సానుభూతి

image

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హత్రస్ తొక్కిసలాట బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. మంగళవారం యూపీలోని హత్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోవడం, పలువురు గాయపడటం బాధాకరమని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.