Srikakulam

News September 29, 2024

శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

image

దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్‌ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.

News September 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్‌లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.

News September 29, 2024

దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్‌లో స్థూపం ఏర్పాటు

image

దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్‌ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 29, 2024

అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ దినకరన్

image

SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

News September 28, 2024

జాతీయస్థాయి హాకీ పోటీలకు సిక్కోలు క్రీడాకారిణి

image

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన చింతాడ చిన్ని జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచి పట్టణంలో జరగనున్న 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరపున పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

News September 28, 2024

శ్రీకాకుళం: కేరళ ముఖ్యమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి

image

కేరళ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విస్తరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి వి.అబ్దురేహిమాన్ లతో చర్చలు జరిపారు. చిన్న విమానాశ్రయాలను మరింత బలోపేతం చేయడానికి, కేరళను అనుసంధానించేందుకు ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.

News September 28, 2024

తేలినీలాపురంలో విదేశీ పక్షుల సందడి

image

టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా సైబీరియా నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చే ఈ విదేశీపక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది కేంద్రంలో విడిది చేస్తాయి. పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే రెండు రకాల పక్షులు సుదూర తీరాలు దాటి టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి వచ్చి ఇక్కడ చింత చెట్లపై నివసిస్తాయి. అటవీశాఖ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.

News September 28, 2024

శ్రీకాకుళం: నిర్మాణాలు పూర్తి చేయకపోతే రద్దువుతాయి

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. మన ఇళ్లు..మన గౌరవం పథకంలో ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పూర్తిచేయకపోతే ఆ నిర్మాణాలు రద్దవుతాయని స్పష్టం చేశారు.

News September 27, 2024

శ్రీకాకుళం: ఎస్పీని కలిసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

image

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డిని, శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా.ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను విధి నిర్వహణలో బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన కోరారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.

News September 27, 2024

World Tourism Day: శ్రీకాకుళం జిల్లాలో మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

శ్రీకాకుళం జిల్లాలో పురాతన ఆలయాలు, బీచ్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరసవిల్లి, తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, దంతపురి, శ్రీముఖలింగంతో పాటు పలు ప్రాంతాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వీటితో పాటు కళింగపట్నం , భావనపాడు,బారువ బీచ్‌లు ఉల్లాసంగా గడిపేందుకు తోడ్పాటునిస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

error: Content is protected !!