India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన న్యూయర్ వేడుకలు
★శ్రీకాకుళం: దువ్వాడ ఇష్యూలో అప్పన్న మిస్సింగ్
★క్యాబేజీ పువ్వులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు న్యూ ఇయర్ విషెస్
★ఎల్.ఎన్ పేట: వ్యర్థాలకు నిప్పు.. గ్రామస్థులకు ముప్పు
★సారవకోట: పైపుల కోసం రోడ్డును తవ్వి వదిలేశారు
★పలాసలో నారీ శక్తి యాప్‌పై అవగాహన

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.