Srikakulam

News August 24, 2025

SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News August 24, 2025

నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

image

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.

News August 24, 2025

సిక్కోలు జిల్లాలో భార్యాభర్తలు ఆత్మహత్య

image

పింఛన్ రద్దై మనస్థాపం చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన గార (M) అంపోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామస్థుడు అప్పారావు(అంధుడు)కు వస్తున్న దివ్యాంగ పెన్షన్ రద్దైనట్లు ఇటీవల నోటీసులొచ్చాయి. ఆర్థికంగా సతమతమైన అప్పారావు భార్య లలిత, కుమార్తె దివ్య(17)లతో కలిసి శనివారం రాత్రి భోజనంలో ఎలుకల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది.

News August 24, 2025

జలమూరు: శిథిలస్థితికి ఏళ్ల చరిత్ర గల ఆలయం..కాపాడాలని వినతి

image

దక్షిణ కాశీగా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం పేరుగాంచింది. ఈ దేవాలయంలోని శిల్ప సంపదను కాపాడాలని అర్చకుడు రాజశేఖర్ మాన్యుమెంట్ అథారిటీ ఛైర్మన్‌ను శనివారం ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలోని పురాతన శాసనాలు, కట్టడాలు పెచ్చులూడి శిథిలమవుతున్నాయని వివరించారు. అభివృద్ధికి చేసేందుకు అడుగులు వేయాలని ఆయను కోరారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని రాజశేఖర్ తెలిపారు.

News August 24, 2025

శ్రీకాకుళం జిల్లాలో(ఎస్‌ఏ) ఇంగ్లిష్ ఫస్ట్ ర్యాంక్‌ బూర్జ వాసికే

image

ఇటీవల విడుదలైన 2025 డీఎస్సీ ఫలితాల్లో బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన మీసాల గోవిందరావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు , స్నేహితులు గోవిందరావును అభినందించారు.

News August 24, 2025

సోంపేట: తీరప్రాంత మహిళలు ఆర్థిక స్వావలంబనకు కూటమి కృషి

image

తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.

News August 23, 2025

ప్రిన్సిపల్‌గా 12వ ర్యాంకు సాధించిన జి.సిగడాం వాసి

image

మెగా డీఎస్సీ – 2025 ఫలితాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా స్టేట్ 12వ ర్యాంకు సాధించారు. తాను ప్రస్తుతం జి. సిగడాం జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. అయితే విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ 12వ ర్యాంకుతో పాటు పీజీటీగా స్టేట్ ఏడవ ర్యాంకు కూడా వచ్చిందన్నారు.

News August 23, 2025

నరసన్నపేట: వంశధార పేపర్ మిల్లు ప్రమాదంలో ఒకరు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

News August 23, 2025

టెక్కలి: చికిత్స పొందుతూ ఇద్దరు మృతి.

image

టెక్కలి మండలం సింగుమహంతిపేట, రెయ్యిపేట గ్రామాల్లో ఈ నెల 19,20 తేదీల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో గణేష్(27), లోకేశ్వరరావు(37) ఇరువురు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడి గణేష్ మృతిచెందగా, పురుగులమందు తాగిన లోకేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 23, 2025

ఆదిత్యుని సేవలో ఏపీ జెన్‌కో ఎండీ

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం సాయంత్రం ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.