Srikakulam

News July 9, 2025

శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

image

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.

News July 9, 2025

హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

image

మందస పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.

News July 9, 2025

రేపు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్

image

శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, ఇంటెల్లిరేస్ సీఈఓ ఆర్. నరేంద్ర మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బి.టెక్ విద్యార్హత ఉండాలన్నారు. 28 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.

News July 9, 2025

ప్రతి ఉద్యోగి అయిదుగురుకైన ఆహ్వానం పలకాలి: జిల్లా కలెక్టర్

image

జూలై 10న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ప్రతి ఉద్యోగి కనీసం ఐదు మంది తల్లిదండ్రులకైనా ఆహ్వానం పలికేందుకు ఇళ్లవద్దకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో, ఇతర అధికారులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం అరపూట సమయం వెచ్చించాలని, సమావేశాలకు భారీగా తరలి రావాలని ఆయన కోరారు.

News July 9, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు వేళాయె..!

image

సింహాచలం గిరి ప్రదిక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి రథం కదలనుంది. 32 కిలోమీటర్ల మేర సాగనున్న ప్రదక్షిణలో సుమారు 5 లక్షలకు పైనే భక్తులు వస్తారని అధికారులు అంచానా వేశారు. తొలిపావంచా నుంచి మొదలయ్యే ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, MVPకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, NAD జంక్షన్, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోనుంది.

News July 8, 2025

మినీ జెట్టి మంజూరు చేయాలని కేంద్రమంత్రికి వినతి

image

కేంద్ర మత్స్య శాఖ మంత్రి లాలన్ సింగ్‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం దిల్లీలో కలిశారు. పెద్ద గనగలవానిపేట వద్ద మినీ జెట్టి నిర్మాణానికి, ఫిష్ లాండింగ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. మంత్రి అచ్చెంనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినత పత్రం అందజేయడం జరిగిందని శంకర్ తెలిపారు.

News July 8, 2025

శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

image

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.

News July 8, 2025

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

News July 8, 2025

SKLM: మెగా పీటీఎం 2.0 పై దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

జూలై 10న నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం శ్రీకాకుళం మండలంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో DEO చైతన్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ భోజనం పథకంపై వివరించాలని, విద్యార్థులుకు ఆటల పోటీలపై దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటాలన్నారు.

News July 8, 2025

నరసన్నపేట: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నరసన్నపేట మండలం ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్ సీ మధుసూదనరావు అందించిన వివరాలు మేరకు మంగళవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహం పడి ఉండడాన్ని గమనించి స్థానికులు సమాచారం అందించారని చెప్పారు. మృతునికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని, గులాబీ టీ షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.