India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా నేపథ్యమంతా శ్రీకాకుళం చుట్టూనే ఉంటుందని చిత్ర కథా రచయిత కార్తీక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్ల మండలం, కూనపేటలో పుట్టిన తాను సినిమాపై ఆసక్తితో 2012లో హైదరాబాద్‌కు వచ్చానన్నారు. 2018లో జిల్లాలోని కొంత మంది మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటి 14 నెలలు పాకిస్థాన్‌లో ఉండగా.. ఆ నేపథ్యాన్నే సినిమాగా తీస్తున్నామన్నారు.
జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన పలువురి వాలంటీర్ల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు ముందు దాదాపు 8,784 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వం మారడంతో వారంతా లబోదిబో మంటున్నారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడికి వారంతా మొర పెట్టుకున్నారు.
సిక్కోలు వాకిట కొలువైన ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలను ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.3,08,400, పూజలు, విరాళాల రూపంలో రూ.71,749 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే ప్రసాదాల రూపంలో రూ.2,24,860 స్వామి వారికి ఆదాయం వచ్చిందని తెలిపారు. మొత్తం రూ.6,05,009 ఆదాయం సమకూరిందని తెలిపారు.
ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో భార్య పిల్లలు కనిపించడం లేదంటూ భర్త చంద్రయ్య ఇచ్చాపురం ఎస్ఐ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వివరాలు.. తొమ్మిదేళ్ల కిందట బాధితుడికి రాములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 13న భర్త చేపలవేటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, తెలిసినచోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
డీపీఈడీ/బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకై నిర్వహించే పీఈసెట్-2024 ఫిజికల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పీఈసెట్ అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని APSCHE సూచించింది.
ఒడిశా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 25, 26, 27 తేదీలలో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రేపు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
ఏపీ కళింగ, కోమటి నూతన అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన బోయిన గోవిందరాజులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై టెక్కలి నియోజకవర్గ కళింగ కోమటి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంపై గోవిందరాజులు హర్ష వ్యక్తం చేశారు.
పాతపట్నం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ గురుకులంలో 6 నుంచి 9వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి.అర్చన తెలిపారు. సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పాఠశాలలో 29న ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీటు కేటాయిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికే సీటు కేటాయిస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస ఎంపీడీవో ఆఫీసులో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మార్వోతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. మరోవైపు లక్ష్మీపురం, అల్లుకోల సర్పంచ్‌లకు బదులుగా వాళ్ల బంధువులు హాజరయ్యారు. దీంతో ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని పలువురు కోరుతున్నారు.
ఎచ్చెర్ల(M) నవభారత్ జంక్షన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. SI చిరంజీవి ఘటన జరిగిన శ్రీకాకుళం నగరం దమ్మల వీధిలో విచారణ చేపట్టారు. బాధితురాలిని అల్లిపల్లి రాధ, నీలిమ, కోడ భవాని, కుందు జయ, మైలపిల్లి కృష్ణవేణి చిత్రహింసలకు గురిచేయగా.. మరో ఇద్దరు బట్టలు విప్పి ఊరేగించారని పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.