India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్య అని ఆపార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్య. ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో ఆఫీసు కూల్చడం సరికాదు. ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏంటి? చట్టాన్ని అతిక్రమించకండి’ అని సీఆర్డీఏ అధికారులకు ఆయన సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. ఐదో రోజు శనివారం 432 మంది విద్యార్థులను పిలవగా 211 మంది హాజరయ్యారు. వారిలో 98 మందికి వివిధ కళాశాలలో సీట్లు లభించింది. ఆఖరి రోజు 2,306 ర్యాంకు నుంచి 2,470 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేశారు. ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఆమె తన వంతుగా కృషి చేశారు.
మీకోసం పేరుతో ఈనెల 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార, ఫిర్యాదుల వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. సోమవారం ఉదయం10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేపడతామని చెప్పారు. సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.
పలాస-విజయనగరం లైన్లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 24న పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు, 24న విశాఖ-బ్రహ్మపూర్ 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 25న భువనేశ్వర్-విశాఖ రైళ్లు రద్దు చేశామన్నారు.
ఆముదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామంలో స్థానిక రైతులు పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాద పంపిణీలో ఈ బెల్లం వినియోగించేందుకు ఇటీవల అధికారులు దీని నాణ్యతను పరీక్షించారు. పూర్తి నాణ్యతగల బెల్లం కావడంతో శనివారం శ్రీవారి ప్రసాద వితరణకు ఆ బెల్లాన్ని తరలించారు. ఇది యావత్ సిక్కోలు ప్రజానీకానికి గర్వకారణమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర అధనంగా రూ.117 పెంచడంతో క్వింటాకు రూ.2300 చొప్పున రైతులకు గిట్టుబాటు కానుంది.
@ వేరుశనగ క్వింటాకు రూ.406,
@ మొక్కజొన్న రూ.135,
@ రాగి రూ.444,
@ మినుములు రూ.450 చొప్పున పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
నగరానికి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామిని ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ఆస్ట్రో, మెడికల్, రత్నాల శాస్త్రవేత్తగా వెంకటస్వామి 4దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ బృందం ప్రకటించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వెంకటస్వామికి ఈ అవార్డు అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు.
1955లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రొక్కం లక్ష్మీ నరసింహదొర స్పీకర్ అయ్యారు. 1983లో శ్రీకాకుళం ఎమ్మెల్యే తంగి సత్యనారాయణ స్పీకర్ స్థానానికి ఎన్నికయ్యారు. 1999లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే కావలి ప్రతిభా భారతి స్పీకర్‌గా వ్యవహరించారు. 2019లో ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం శాసనసభాపతి కాగా.. తాజాగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Sorry, no posts matched your criteria.