India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ ఆదేశించారు. నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్షీంచారు.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలకేంద్రంలోని స్థానిక మైత్రికాలనీలో గొండు రమేష్(38) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఇతనికి మూడేళ్ల పాప, రెండు నెలల బాబు ఉన్నారు. కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబపోషణ చేసేవారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.
ప్రియుడి ఇంటిముందు న్యాయం కోసం ప్రియురాలు నిరసనకు దిగిన ఘటన సోంపేట మండలంలో జరిగింది. రాజాం గ్రామానికి చెందిన డొక్కరి చిరంజీవి తనని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని నమ్మించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని మందస మండలం జిళ్లందకు చెందిన ఓ యువతి తెలిపింది. శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలిపింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. ఈ మేరకు మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది
వివాహిత కిడ్నాప్ ఘటనపై కేసు నమోదుచేసినట్లు వన్‌టైన్ SI శ్యామల రావు తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన జి.తేజేశ్వరరావు పొన్నాడకు చెందిన వల్లంగి పల్లవి ప్రేమ పెళ్లిచేసుకున్నారు. మంగువారితోటలో నివాసముంటున్నారు. కాగా ఈ నెల 20న సుశీల కొంతమందితో తేజేశ్వరరావు ఇంటికి వెళ్లి పల్లవిని తీసుకెళ్లిపోయింది. దీంతో తేజేశ్వరరావు తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం 1400 నుంచి 1642 మధ్య ర్యాంకు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 474 మందికి 230 మంది హాజరయ్యారు. ఇందులో 113 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఇప్పటివరకు 502 మందికి ప్రవేశాలు కల్పించారు. శనివారం 1874 నుంచి 2083 మధ్య కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా MLAలు శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శ్రీకాకుళం MLA శంకర్, పాతపట్నం MLA గోవిందరావు, పలాస MLA శిరీష, ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టెక్కలి నుంచి గెలిచిన అచ్చెన్నాయుుడు ఆరోసారి, ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ హ్యాట్రిక్ MLAగా అసెంబ్లీకెళ్లారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మన్యం జిల్లాలో, రాజాం విజయనగరంలో కలిసిన విషయం తెలిసిందే.
2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.
పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా సంస్థ సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ అర్హతలు గల అభ్యర్థులు ముందుగా gdcplkd.ac.in వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకొని పాస్ ఫోటో, బయోడేటా, అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ఎంపీ రామ్మోహన్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఒక జట్టులా కృషిచేద్దామంటూ రామ్మోహన్నాయుడు జిల్లా నుంచి ఎన్నికైన వారికి X (ట్విటర్)లో ట్వీట్ చేశారు.
ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈనెల 25 నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళల కోసం టైలరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఉంటాయని సంస్థ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలో ఉన్న శిక్షణ సెంటర్లో సంప్రదించాలని కోరారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య మహిళలు అర్హులని అన్నారు.
Sorry, no posts matched your criteria.