India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 26 తేది అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించేలా 3నిమిషాల నిడివిగల లఘు చిత్రాన్ని చిత్రీకరించి 6309990940 (PRO) జూన్ 25 తేది ఉదయానికి వాట్సాప్ ద్వారా పంపించాలని జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక శుక్రవారం కోరారు. వచ్చిన లఘు చిత్రాలను ఎంపిక చేసి రూ.5 వేలు, 3 వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు.
తొగరం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు గడువు పెంచినట్లు ప్రిన్సిపల్ పైడి వెంకటరావు గురువారం తెలిపారు. విద్యార్థులు కోర్సుల్లో చేరేందుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని చెప్పారు. 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. www.angrau.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు మొత్తం 9,832 మంది విద్యార్థులు హాజరు కాగా 9,777 మంది ఉత్తీర్ణత సాధించారు. 99.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోర్సులు వారీగా బీఏలో 1235 మందికి 1229 మంది, బీసీఏలో 160 మందికి 155 మంది, బీసిఏలో 158 మందికి 156 మంది, బీకాంలో 1519 మందికి 1509 మంది, బీఎస్సీలో 6760 మందికి 6728 మంది ఉత్తీర్ణత సాధించారు.
పలాస, శ్రీకాకుళం మీదుగా డిబ్రుగఢ్(DBRG)- కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.నెం .22504 DBRG – CAPE ట్రైన్‌ను జులై 8 నుంచి, నెం.22503 CAPE – DBRG ట్రైన్‌ను జులై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
డా.బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌కు 9,832 మంది విద్యార్థులకు గాను 9,777 మంది (99.44 శాతం) ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ వివరాలను వెల్లడించారు. బీఈడీ మూడో సెమిస్టర్లో 1,027 కి 875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 26వ తేదీ ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. యువత ఉత్సాహంగా పాల్గొనాలని, డగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మొబైల్ ఫోన్స్ రికవరీపై ఎస్పీ జి.ఆర్ రాధిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు సుమారు 72 ఫోన్‌లను ట్రాక్ చేసి ఎస్పీ చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 518 ఫోన్లు రికవరీ చేశామని వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని ఎస్పీ రాధిక తెలిపారు.
ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా
విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైలు నం.20807 విశాఖపట్నం- అమృత్‌సర్ ట్రైన్‌ను జూలై 5, 6, 9 తేదీలలో, నం.20808 అమృత్‌సర్- విశాఖపట్నం ట్రైన్‌ను జూలై 6, 7, 10 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమవేశాన్ని నిర్వహించారు. కొత్త వ్యక్తులు సమాచారం సేకరణ, అనుమానిత వ్యక్తులపై నిఘా, లాడ్జిలు, వాహనాలను విసృతంగా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాహన తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పాటుకు వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో పిడుగు పాటుకు ఆవులు కాపరి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.