Srikakulam

News June 20, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను గురువారం యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డా. ఉదయభాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్‌తో పాటు జ్ఞానభూమి పోర్టల్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://nanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.

News June 20, 2024

శ్రీకాకుళంలో రోడ్డెక్కిన నిరుద్యోగులు

image

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో చదువుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు ఆడిటోరియం గదిని కేటాయించాలని కోరుతూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో మాట్లాడి అభ్యర్థులకు గదిని అందించారు.

News June 20, 2024

శ్రీకాకుళం: ఐటీఐల్లో 112 మందికి ప్రవేశాలు

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో సీట్ల భర్తీకి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో జరుగుతున్న తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు బుధవారం 112 మంది విద్యార్థులకు వివిధ ఐటీఐల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 464 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా 201 మంది హాజరయ్యారు. వీరిలో 112 మందికి సీట్లు కేటాయించారు. ఈరోజు 878 నుంచి 1,399 ర్యాంకు వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

News June 20, 2024

పలాస పాసింజర్ గమ్యం కుదింపు

image

పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.

News June 20, 2024

SKLM: అమ్మవారి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు

image

సంతబొమ్మాలి, నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగూడు, గంటపేటలోని అమ్మవారి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని స్థానికులు వాపోయారు. అమ్మవారి ఉత్సవాల పేరుతో మంగళవారం రాత్రి గ్రామాల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించడం వివాదాస్పదంగా మారింది. సంతబొమ్మాలి, నౌపడ పోలీస్ స్టేషన్లకు సమీపంలో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. 

News June 20, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.

News June 19, 2024

యుద్ధ ప్రాతిపదికన వంశధార కాలువ పనులు: మంత్రి అచ్చెన్న

image

పలాస మండలం టెక్కలిపట్నం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ప్రధాన కాలువను బుధవారం మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పలాస ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ గత ఐదేళ్లలో సాగునీరు రాక పిచ్చి మొక్కలు, పొదలతో నిండిన కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి శివారు పొలాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు.

News June 19, 2024

వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆమదాలవలస మండలం తొగరం గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.పైడి వెంకట్రావు తెలిపారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువును పెంచుతున్నట్లు చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ విద్యార్ధుల వినతి మేరకు దరఖాస్తు గడువును పొడిగించామన్నారు.

News June 19, 2024

శ్రీకాకుళం: PG పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్శిటీ పరిధిలో MSc (అప్లైడ్ కెమిస్ట్రీ) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ (2020-2021 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. జూలై 8, 9, 10, 11, 12 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైమ్‌టేబుల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/వెబ్‌సైట్ చూడవచ్చు.

News June 19, 2024

గజపతిరాజు జ్ఞానం స్ఫూర్తినిస్తుంది: మంత్రి రామ్మోహన్

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును అదే శాఖకు నియమితులైన రామ్మోహన్నాయుడు బుధవారం విజయనగరంలోని గజపతిరాజు బంగ్లాలో కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన అంశాలు చర్చించారు. ఆయనను కలవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ X (ట్విటర్) ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. గజపతిరాజు సలహాలు, మద్దతు వెలకట్టలేనివని, ఆయన జ్ఞానం ఎప్పుడూ తనకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు.