India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు, భవనాళ శాఖ, పంచాయతీరాజ్, ఫైర్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. అల్పపీడనం కొనసాగుతున్నందున ఎక్కడ నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు.

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు 43 వినతులు ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి పొందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. జూమ్ ద్వారా ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 మండలాల్లో 16 మండలాల్లో కురిసిన భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం మధ్యాహ్ననానికి జిల్లా మొత్తం మీద 138.6 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.4మి.మీ రికార్డు అయింది. వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో, కాలువుల్లో నీరు చేరుతుంది.

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఇటీవల కవిటికి బదిలీ అయిన సౌమ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే ఈమె బదిలీ వివాదం కొనసాగుతోంది. పలు యూనియన్లు ఈమెకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సూసైడ్ కలకలం రేపుతుంది. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ చిన్నారులకు సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ ఐ.విమల తెలిపారు. అయితే కార్యకర్తలు, సహాయకులు కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా స్టాక్ నిల్వలను భద్రంగా ఉంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బందిపై సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

19, 20 తేదీల్లో విశాఖలోని జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. వారందరూ శ్రీకాకుళం కోడి రామమూర్తి మున్సిపల్ స్టేడియంకు 19న ఉదయం 5 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారానికి 98850 96734 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
Sorry, no posts matched your criteria.