India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.
సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
శ్రీకాకుళం మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తున్న ఎం.కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెప్మా కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ రమణ పీడీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్‌కు స్థానిక కార్యాలయ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రమణకు అభినందనలు తెలిపారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఇచ్చాపురంలో స్థానిక నాయకులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో లోక్ అదాలత్ మొత్తం 21 బెంచ్‌లు ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం వెల్లడించారు. జిల్లాల మొత్తం పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు 2751 గుర్తించడం జరిగిందన్నారు. ప్రీ లిటిగేషన్ కేసులు 545 ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట కార్యదర్శి, ఆర్ సన్యాసి నాయుడు ఉన్నారు.
శ్రీకాకుళం DRBRAU నిర్వహిస్తున్న డిగ్రీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ITEP)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. అభ్యర్థులు www.brau.edu.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు బిఏబిఈడీలో 50 సీట్లు, బీఎస్సీబీఈడీలో 50 సీట్లు ఉన్నాయి. ఇంటర్ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎస్సీపిటి పరీక్షల్లో స్కోర్ సాధించిన వారికి ప్రవేశాలు నిర్వహిస్తారు.
సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి బదిలీలు నిర్వహించారు. మొత్తం 238 మంది మహిళా పోలీసులు ఆన్‌లైన్‌లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 71 మందికి బదిలీలు చేయగా 149 మంది యథావిధిగా వారి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలపగా,18 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్థాపించి 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆన్‌లైన్‌లో జాతీయస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్విజ్ పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రస్థాయి, సౌత్ ఇండియా, జాతీయ స్థాయి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. దీని కోసం https://www.rbi90.quiz.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ఒకరు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సారవకోట మండలం రెల్లివీధికి చెందిన కోటిపల్లి వీరయ్య(62) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా గోడ పడిపోవడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.