India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కవిటి మండలం శవసానపుట్టుగలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. కత్తివరం- బోడర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బోడర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ అభ్యర్థి ప్రకాశ్.. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రామారావు అన్నారు.
వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ట మల్లేశ్వరరావు అన్నారు. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ కార్యాలయంలో ఆయన పీపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్షి అధినీయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత మొదలైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని బీ-ఫార్మసీ నాలుగో ఏడాది 2వ సెమిస్టర్(2017- 18 రెగ్యులేషన్) థియరీ పరీక్షలను జూలై 25 నుంచి నిర్వహించనున్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు ప్రాజెక్టు వర్క్ నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతుల కారణంగా ఈ నెల 17న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు. ఈ మేరకు వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే నం.20819,నం.20820 పూరి- ఓఖా ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 3 మధ్య విజయవాడ- విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు
సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధించిన సంగతి తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల మండలాల మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్ల మరమ్మతుల పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.
రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతులు కారణంగా ఈ నెల 17వ తేదీన పలు రైళ్లు అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా బక్రీద్ చేసుకోవాలని కోరారు. ఆవులను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే క్రమంలో తగిన పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 18 నుంచి 22 వరకు మధ్య వర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం కోర్టు హాలులో శనివారం న్యాయవాదులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 18న ఉదయం 9.00 నుండి 9.30 వరకు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణకు న్యాయవాద మధ్యవర్తులు పాల్గొనేలా చూడాలని ఆయన సూచించారు.
శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ శనివారం తొలిసారిగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అధికారులతో దిల్లీలో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో AAI విధులు, ఇటీవల AAI సాధించిన విజయాలను తెలుసుకున్నానని రామ్మోహన్ పేర్కొన్నారు. విమానయాన రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పడానికి ఇదే సరైన సమయం అని వారికి తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశానని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.