Srikakulam

News August 13, 2025

SKLM: సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

image

పోలీస్ కుటుంబ సభ్యులకు సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా SP మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళం SP కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని, బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

News August 13, 2025

SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

image

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం కోర్ట్ ఆవరణలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రాజీలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు విషయంలో అధిక శ్రద్ధ వహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.

News August 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు వర్షసూచన

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండొద్దన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

News August 12, 2025

నులి పురుగులను నిర్మూలిద్దాం: జిల్లా కలెక్టర్

image

నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో నీరస పడతారని వివరించారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపం వస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

News August 12, 2025

మరోసారి తండ్రైన రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంలో సందడి నెలకొంది. రామ్మోహన్ దంపతులకు మంగళవారం ఉదయం కుమారుడు జన్మించాడు. ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా తాజాగా కుమారుడు జన్మించడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News August 12, 2025

పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ: ధర్మాన

image

పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రహసనం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం ఈ ఎన్నిక అన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓటు వేయకుండా అడ్డుకోవడం టీడీపీకే చెల్లిందని విమర్శించారు. దిగజారిన రాజకీయాలతో ఆనందాన్ని అనుభవించడం చంద్రబాబు నైజమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News August 12, 2025

శ్రీకాకుళం: డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి బ్రేక్

image

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్యసేవ విభాగానికి 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. కాగా డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియకు తాజాగా బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్, ఆసుపత్రి HDS Chairman ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని శ్రీకాకుళం సర్వజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News August 11, 2025

SKLM: పీజీ‌ఆర్‌ఎస్‌కు 86 వినతులు

image

జిల్లా కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధ్యక్షతన జరిగిన పి.జి.ఆర్‌.ఎస్‌ కార్యక్రమానికి 86 అర్జీలు వచ్చాయి. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శిరీష, పలువురు దరఖాస్తులు సమర్పించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకంకు సంబంధించి అత్యధికంగా 21, రెవెన్యూ విభాగానికి 20, వ్యవసాయ శాఖకు 11, విద్యుత్ తదితర శాఖలకు సంబంధించి వినతులు వచ్చాయని కలెక్టర్ అన్నారు.

News August 11, 2025

SKLM: అనాథుల సంరక్షణపై పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

అనాథ పిల్లలకు సంరక్షణ కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఫోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లలకు తాత్కాలికంగా లేదా, శాశ్వతంగా సంరక్షించే విధానమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.

News August 11, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలపై వినతులు ఇచ్చేందుకు Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలన్నారు. వాటి పరిష్కార స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.