Srikakulam

News September 7, 2024

శ్రీకాకుళం: మరో మూడు రోజులు భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 7, 2024

శ్రీకాకుళం: పదో తరగతి సాధారణ పరీక్షల్లో మార్పులు: డీఈవో

image

పదో తరగతి సాధారణ పరీక్షలు మార్చి-2025లో సప్లమెంటరీ పరీక్షలు మేలో జరుగుతాయని DEO తిరుమల చైతన్య తెలిపారు. నూతన సిలబస్ నమూనా ప్రశ్నాపత్రములు WWW.bseap.gov.in లో ఉంటాయన్నారు. నూతన సిలబస్ పాఠ్యపుస్తకాల ఆధారంగా పరీక్షలు జరుగుతాయన్నారు. 2023-24 అంతకు పూర్వం మార్చి, మే, జూన్ పరీక్షలలో ఫెయిలైన వారికి పాత సిలబస్ ఆధారంగా పరీక్షలు ఉంటాయన్నారు.

News September 7, 2024

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్

image

ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంలో శనివారం బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిపై దివ్వెల మాధురికి అన్ని హక్కులూ కల్పిస్తూ కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టేషన్ చేసిన డాక్యూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మాధురి మధ్య నెలకొన్న వివాదంలో తాజాగా సంచలనాత్మకమైన అంశం తెరపైకి వచ్చింది.

News September 7, 2024

బొరివంకలో అపురూప దృశ్యం

image

వినాయక చవితి రోజున కవిటి మండలం బొరివంక గ్రామంలో అపురూప దృశ్యం కనువిందు చేసింది. గ్రామస్థుడు మజ్జి బోనమాలి తమ తోటలో పెరుగుతున్న కర్ర పెండలం దుంపలో గణనాథుని రూపం కనిపించడంతో సిద్ధి వినాయక మండపం వద్దకు తీసుకొచ్చాడు. వినాయకుని రూపంలోనే ఉండడంతో స్థానిక భక్తులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు చూడటానికి ఎగబడ్డారు.

News September 7, 2024

డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 46 శాతం పీజీ ప్రవేశాలు

image

ఎచ్చెర్ల డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను పీజీ ప్రవేశాలు 46 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ పీజీ సెట్-2024 అలాట్ మెంట్‌లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. వివిధ కోర్సుల్లో మొత్తం 562 సీట్లకు గాను 259 సీట్లకు ప్రవేశాలు జరిగాయి. విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది.

News September 7, 2024

కవిటి ఉద్దాన ప్రాంతంలో మొక్క పెసలతో బొజ్జ గణపయ్య

image

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.

News September 7, 2024

నరసన్నపేట: మహిళా కానిస్టేబుల్ మృతి

image

నరసన్నపేటలోని జగన్నాథపురంలో నివాసం ఉంటున్న గుర్రాల అనూష అనే ఎస్ఈబీ మహిళా కానిస్టేబుల్ శుక్రవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి విధితమే. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి శుక్రవారం రాత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. ఆమె తల్లి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News September 7, 2024

శ్రీకాకుళం రైలు రోడ్డులో రెండు నిమిషాలు ప్రత్యేక హాల్ట్

image

రైలు ప్రయాణికులకు సీనియర్ డీసీఎం కే.సందీప్ శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేశారు. చెన్నై సెంట్రల్- సత్రా గచ్చి (06089,06090), తంబరం – సత్రాగచ్చి (06095)మధ్య ప్రత్యేక రైలు శ్రీకాకుళం రైలు రోడ్డులో రెండు నిమిషాలు హాల్ట్ కల్పించినట్లు తెలిపారు. దువ్వాడ మీదుగా హౌరా- సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడుస్తున్న రైలు యశ్వంత్ పూర్ వరకు పొడిగించామన్నారు.

News September 6, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

➠ మట్టి వినాయకుడిని పూజిద్దాం: రామ్మోహన్
➠ రేగిడి మండలంలో కాలువలో పడి వ్యక్తి మృతి
➠ గారలో చాక్లెట్లతో భారీ విఘ్నేశ్వరుడు
➠ రాజమండ్రిలో జిల్లా వాసి మృతి
➠ ఇచ్చాపురంలో బాడీ లోషన్ తాగి వివాహిత ఆత్మహత్య
➠ రాజాంలో అందుబాటులో తిరుమల లడ్డు
➠ కోటబొమ్మాలిలో 20 ఏళ్ల అరుదైన గుడ్లగూబ మృతి

News September 6, 2024

ఇక నుంచి రాజాంలో అందుబాటులో తిరుమల లడ్డూ

image

తిరుపతి లడ్డూ ప్రసాదం మారుమూల గ్రామాలకు కూడా అందించాలనే దృక్పథంతో, లడ్డూను రాజాంలోని టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అంతకాపల్లి బాలాజీ టెంపుల్‌లో విక్రయించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైజాగ్ రుషికొండ ఏఈవో జగన్మోహనాచార్యులు నెలలో రెండు పర్యాయాలు విక్రయించేందుకు.. రేపు వినాయక చవితి సందర్భంగా ఉదయం 10గం. తిరుపతిలో విక్రయించే ధరకే కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.