Srikakulam

News June 14, 2024

సర్పంచ్ పదవికి గోండు శంకర్ రాజీనామా

image

శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గోండు శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన గోండు శంకర్.. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. దీంతో గోండు శంకర్ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డీపీఓ వెంకటేశ్వరరావుకు అందజేశానని ఆయన తెలిపారు.

News June 14, 2024

పెళ్లి సంబంధాలు.. కువైట్‌లో సోంపేట వాసి మృతి

image

సోంపేట మండలం జింకిభద్రకు చెందిన లోకనాథ్(31) నిన్న కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందాడు. చిరంజీవి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లోకనాథం ఉన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కువైట్‌కు వెళ్లి పనుల్లో చేరాడు. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో నెల రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 8న బయలుదేరి వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News June 14, 2024

శ్రీకాకుళం: మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

image

వీరఘట్టం మండలం బూరుగ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ(38) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణంనాయుడు గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన బాలకృష్ణను భార్యతో పాటు తన తల్లి మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 14, 2024

తొలిరోజు పాఠశాలలకు 63.75 శాతం హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 రోజుల సెలవులు అనంతరం గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు పాఠశాలలు మొత్తం 3,055 ఉండగా.. వీటిల్లో తొలిరోజు 63.75 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,57,274 మంది విద్యార్థులు చదువుతుండగా.. తొలి రోజు 1,32,949 మంది హాజరై, 76,330 మంది గైర్హాజరయ్యారని డీఈవో కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు.

News June 14, 2024

ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. జిల్లా కోర్టుతో పాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాలి, నరసన్నపేట, కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం కోర్టులలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News June 14, 2024

స్పీకర్ పదవి రేసులో శ్రీకాకుళం జిల్లా ముఖ్య నేత

image

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీ స్పీకర్ పదవి రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారామ్‌ను రవి ఓడించారు. చంద్రబాబు కేబినెట్‌లో శ్రీకాకుళం నుంచి అచ్చెన్నకు చోటు దక్కగా.. స్పీకర్ పదవి సైతం జిల్లా నేతకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ పదవికి రవితో పాటు అయ్యన్న, కళా వెంకట్రావు, తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News June 14, 2024

శ్రీకాకుళం: డిగ్రీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో జనవరి- 2024లో జరిగిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.

News June 13, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రగతి ఇది మరో మంచి అవకాశం

image

శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి గురువారం విజయవాడలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా ప్రగతికి సీఎం చంద్రబాబు నాయుడు మరో అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 13, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార డ్యూటీకి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఏ లక్ష్మయ్య రెడ్డి నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార బందోబస్త్‌లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా నేటి ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేటకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News June 13, 2024

టెక్కలిలో YCP నాయకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.