Srikakulam

News June 13, 2024

టెక్కలిలో YCP నాయకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.

News June 13, 2024

రాజాం: ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం

image

మొగిలివలస వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన సత్యం, కుమార్ రాజాంలో కూరగాయలు కొని ఆటోలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కుపోయిన వారిని 108లో ఉన్న పనిముట్లతో ఆటోను కట్ చేసి రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News June 13, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేసే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.

News June 13, 2024

శ్రీకాకుళం: 1996 నుంచి కొనసాగుతున్న అచ్చెన్నాయుడు

image

టెక్కలిలో హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996 ఉపఎన్నికల్లో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఓటమి చవిచూసిన అచ్చెన్న 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2020 నుంచి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

News June 13, 2024

శ్రీకాకుళం: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ(2013- 14 బ్యాచ్, 2021- 22 తర్వాతి బ్యాచ్‌లు) పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. జూలై 6, 8, 9, 10,11 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 12, 2024

శ్రీకాకుళం: B.Ed మొదటి సెమిస్టర్ నోటిఫికేషన్ విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులు జరిమానా లేకుండా పరీక్ష రుసుం చెల్లించేందుకు జులై 3 చివరి తేదీ. అభ్యర్థులు మొత్తం యూనివర్సిటీ మైగ్రేషన్ ఫీజుతో కలిపి రూ.1,635 పరీక్ష ఫీజును చెల్లించాలి. జులై 19 నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

News June 12, 2024

ఇచ్ఛాపురం: రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

image

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఇచ్ఛాపురం దాసన్నపేట మెయిన్ రోడ్డులో నివాసం ఉన్న కస్పా రాజేష్ (32) హైదరాబాదులో ఒక ప్రైవేట్ జిమ్‌లో శిక్షకుడిగా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా సింహాచలం దర్శనానికి ఇచ్ఛాపురం వస్తుండగా శ్రీకాకుళం పరిసరాలలో రైలు నుంచి జారి పడిన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు ఉన్నారు.

News June 12, 2024

శ్రీకాకుళం: విజయనగరంపై విశాఖ జట్టు విజయం

image

టెక్కలిలో జరుగుతున్న అండర్-23 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో రెండో రోజు విజయనగరం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 338 పరుగులు చేయగా తదుపరి బ్యాటింగ్ చేసిన విజయనగరం జట్టు 274 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో 64 పరుగులతో విశాఖ జట్టు గెలుపొందింది. ఆర్గనైజింగ్ కన్వీనర్‌గా ఎన్.లాల్ బహుదూర్ వ్యవహరించారు.

News June 12, 2024

SKLM: CM చీఫ్ సెక్రటరీగా సిక్కోలు వాసి

image

నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సవిరిగాం గ్రామానికి చెందిన IAS అధికారి ముద్దాడ రవిచంద్రకు అరుదైన అవకాశం లభించింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ, CMO కార్యాలయం చీఫ్‌గా నియమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి స్వీకరణ అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరించారు.

News June 12, 2024

లావేరు: వ్యాన్ బోల్తా 1500 కోళ్లు మృతి

image

లావేరు మండలంలోని బెజ్జిపురం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. SKLM నుంచి VSKP వెళ్తున్న కోళ్లు వ్యాన్ రహదారి పక్కన ఆగివున్న లారీని అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో 1600 కోళ్లు ఉండగా,1500 కోళ్లు ప్రమాదంలో మరణించాయి. కాగా వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు.